కశ్మీర్ మాతోనే ఉంటుంది : అఫ్రిదిపై ధావన్ ఫైర్

పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.. కశ్మీర్‌పై భారత ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేయడంపై భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా ఖండించాడు. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లకు మద్దతుగా ధావన్ నిలిచి పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిదిపై మండిపడ్డాడు. ‘ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేస్తుంటే పాకిస్థాన్ మాత్రం కశ్మీర్ పై పడి ఏడుస్తున్నారు. కశ్మీర్ మాది.. కశ్మీర్ ఎప్పటికీ మాతోనే ఉంటుంది. కావాలంటే మీ 22 కోట్ల మందిని తీసుకురా. మాలో ఒక్కరు 15 లక్షల మందితో సమానం’ అని ధావన్ తన ట్విట్టర్ అకౌంట్లో గట్టిగా బదులిచ్చాడు.
Is waqt jab saari duniya corona se lad rahi hai us waqt bhi tumko kashmir ki padi hai.
Kashmir humara tha humare hai aur humara hi rahega. Chaiyeh 22 crore le ao, humara ek, sava lakh ke barabar hai . Baaki ginti apne aap kar lena @SAfridiOfficial— Shikhar Dhawan (@SDhawan25) May 17, 2020
ఇటీవల పీఓకేలో జరిగిన బహిరంగ సమావేశంలో షాహిద్ అఫ్రిది పీఎం మోడీ, భారత ఆర్మీ, కశ్మీర్లో ప్రస్థుత పరిస్థితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన భారత జట్టు క్రికెటర్లు స్పందించారు. గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ అఫ్రిదిపై మండిపడ్డారు. అఫ్రిదీ 16 ఏళ్ల వృద్ధుడు, పాక్ లోని 7 లక్షల సైన్యానికి 20 కోట్ల ప్రజల మద్దతుందని అన్నాడు. వాళ్లు 70 ఏళ్లుగా కశ్మీర్ కోసం యాచిస్తూనే ఉన్నారు.
Really disappointed by @SAfridiOfficial‘s comments on our Hon’b PM @narendramodi ji. As a responsible Indian who has played for the country, I will never accept such words. I made an appeal on your behest for the sake of humanity. But never again.
Jai Hind ??
— yuvraj singh (@YUVSTRONG12) May 17, 2020
పాక్ ప్రజల్ని మోసం చేయడానికి అఫ్రిదీ, ఇమ్రాన్ ఖాన్, బజ్వా లాంటి జోకర్లు భారత్‌పై, ప్రధాని మోడీపై విషం చిమ్ముతున్నారని తమదైన శైలిలో ధీటుగా బదులిచ్చారు. యువరాజ్ సింగ్ కూడా అఫ్రిది వ్యాఖ్యలను ఖండించాడు. ప్రధాని మోడీపై అఫ్రిది వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపాడు. ఒక దేశం పట్ల బాధ్యతాయుతమైన వ్యక్తిగా తాను ఇలాంటి వ్యాఖ్యలను ఎప్పటికీ సమర్థించనని అన్నాడు. పాక్‌లో అఫ్రిది ఫౌండేషన్‌లో విరాళాల కోసం యువరాజు, హర్భజన్ అతడికి మద్దతు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
Read Here>> అఫ్రిదిపై గంభీర్ ఫైర్.. అతడో జోకర్..!