Gujarat Elections: హామీల జల్లు కురిపించిన అరవింద్ కేజ్రీవాల్
చూస్తూ ఉండండి.. పంజాబ్‌లో తొందర్లోనే 51 లక్షల కుటుంబాలు ఇక విద్యుత్ బిల్లు చెల్లించక్కర్లేని రోజు వస్తుంది. వారి బిల్లు సున్నాకు పడిపోతుంది. అలాగే గుజరాత్లో కూడా ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్‌ను ఇస్తాం. ఢిల్లీలో 12 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇక్కడ కూడా 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అలాగే ట్రేడర్స్ కోసం అడ్వైసరీ బాడీని ఏర్పాటు చేస్తాం. వ్యాట్ (వాల్యూ ఆడెడ్ టాక్స్)ను సైతం రద్దు చేస్తాం

Kejriwal promises free power supply around the clock ro Gujarat people
Gujarat Elections: గుజరాత్ ప్రజలపై అరవింద్ కేజ్రీవాల్ హామీల జల్లు కురిపించారు. ఈ యేడాది డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆదివారం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే అందరికీ ఉచితింగా 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు గతంలోని పెండింగ్ బిల్లులను రద్దు చేస్తామని అన్నారు. ఇక నిరుద్యోగంపై ఆయన మాట్లాడుతూ 10 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి ఇస్తామని ప్రకటించారు.
గత నెలలో గుజరాత్లో పర్యటించిన కేజ్రీవాల్.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా డిసెంబర్ 2021 వరకు ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేస్తామని ప్రకటించారు. 1998 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతోందని, తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటామని ఆయన అన్నారు. దీనికి ఆయన ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలను ఉదహారణగా చూపించారు. ఆ రెండు రాష్ట్రాల్లో అమలు చేసిన విధంగానే గుజరాత్‌తో సైతం అమలు చేస్తామని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘చూస్తూ ఉండండి.. పంజాబ్‌లో తొందర్లోనే 51 లక్షల కుటుంబాలు ఇక విద్యుత్ బిల్లు చెల్లించక్కర్లేని రోజు వస్తుంది. వారి బిల్లు సున్నాకు పడిపోతుంది. అలాగే గుజరాత్లో కూడా ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్‌ను ఇస్తాం. ఢిల్లీలో 12 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇక్కడ కూడా 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అలాగే ట్రేడర్స్ కోసం అడ్వైసరీ బాడీని ఏర్పాటు చేస్తాం. వ్యాట్ (వాల్యూ ఆడెడ్ టాక్స్)ను సైతం రద్దు చేస్తాం’’ అని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
Ashok Gehlot on Nirbhaya Act: నిర్భయ చట్టం తర్వాత హత్యలు పెరిగాయి: రాజస్తాన్ సీఎం షాకింగ్ కామెంట్స్