Kerala Govt : కేరళలో కరోనా తగ్గుముఖం.. పండుగల్లో 1500 మంది వరకు పాల్గొనొచ్చు..!
కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత తగ్గుతోంది. కొత్త కరోనా కేసులు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి.

Kerala Govt Allows Gatherin
Kerala govt Covid dip : కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత తగ్గుతోంది. కొత్త కరోనా కేసులు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా తగ్గినట్టే కనిపిస్తోంది. కేరళలోనూ కరోనా తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో గణనీయంగా తగ్గుదల కనిపించింది.
ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలను సడలిస్తోంది. అందులోనూ వచ్చేది పండుగ సీజన్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది. రాష్ట్రంలో ప్రతి ఏడాది జరుపుకునే పండుగ వేడుకల్లో ప్రధానంగా అలువా శివరాత్రి, మారమోన్ కన్వెన్షన్, అట్టుకల్ పొంగల్ ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరవుతుంటారు.
ఇప్పటివరకూ కొవిడ్ పరిమితుల దృష్ట్యా పెద్ద సంఖ్యలో ప్రజలు గుడిగూడేందుకు అనుమతి లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గడంతో ప్రభుత్వం పండుగ వేడుకల్లో 1,500 మంది వరకు పాల్గొనేందుకు అనుమతించాలని నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాల్లో ఒకేచోట ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందిగా సూచించింది. అలాగే సామాజిక దూరాన్ని పాటించాల్సిందిగా కరోనా మార్గదర్శకాల్లో సూచించింది.
కోవిడ్ -19 ప్రోటోకాల్ కు లోబడి పండుగలు మతపరమైన కార్యక్రమాలకు పరిమితంగా 1500 మంది వరకు హాజరు కావొచ్చునని ప్రభుత్వ ఉత్తర్వుల్లో వెల్లడించింది. అంతేకాదు.. 72 గంటల్లోపు RT-PCR నెగటివ్ సర్టిఫికేట్ లేదా గత మూడు నెలల్లో తమకు వైరస్ సోకిందని నిరూపించే డాక్యుమెంట్ కలిగిన 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే పండుగలు జరిగే ప్రదేశాల్లోకి అనుమతి ఉంటుందని కేరళ ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. 18 ఏళ్ల లోపు వయస్సు వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగలకు హాజరుకావచ్చునని తెలిపింది.
అట్టుకల్ పొంగలా (Attukal Pongala)పై మార్గదర్శకాలు..
రాష్ట్రంలో ప్రతి ఏడాది ఘనంగా జరుపుకునే అట్టుకల్ పొంగలాపై ప్రభుత్వం కొన్ని ఆంక్షలను విధించింది. భక్తులు బహిరంగ ప్రదేశాల్లో లేదా రోడ్లపై పొంగలా (దేవునికి నైవేద్యం) సమర్పించడం వంటి కార్యక్రమాలకు భక్తులకు అనుమతి లేదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తమ ఇళ్ల వద్ద నుంచే నైవేద్యాన్ని సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. ప్రపంచంలోని అతిపెద్ద మహిళా మతపరమైన వేడుకుల్లో ఒకటైన అట్టుకల్ పొంగలాను ఫిబ్రవరి 17న ఘనంగా జరుపుకోనున్నారు.
కేరళలోని తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయ వార్షిక ఉత్సవంలో ‘పొంగలా’ సిద్ధం చేయడమనేది ఒక పవిత్రమైన ఆచారంగా వస్తోంది. గత ఏడాది కూడా బహిరంగ ప్రదేశాల్లో మహిళా భక్తులు పెద్దఎత్తున గుమికూడకుండా, రోడ్డు పక్కన పెద్దఎత్తున పొయ్యిలు పెట్టి పొంగళ పండుగ నిర్వహించారు. కేరళలో రోజువారీ కోవిడ్ -19 కేసులు 20,000 కంటే తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో శుక్రవారం (ఫిబ్రవరి 11)న 16,012 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,81,063కి చేరింది.
Read Also : CM KCR : కేంద్రం కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎక్కువ : సీఎం కేసీఆర్