Prakash Raj : విజయేంద్ర ఇంగల్గీ క్యారెక్టర్‌లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్

‘రాకింగ్ స్టార్’ యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2. కోలార్ మైనింగ్ నేపథ్యంలో కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ ఫస్ట్ పార్ట్ సంచలన విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది.

Prakash Raj : విజయేంద్ర ఇంగల్గీ క్యారెక్టర్‌లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్

Kgf 2 Team Birthday Wishes To Versatile Actor Prakash Raj1

Updated On : March 26, 2021 / 3:20 PM IST

Prakash Raj : ‘రాకింగ్ స్టార్’ యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2. కోలార్ మైనింగ్ నేపథ్యంలో కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ ఫస్ట్ పార్ట్ సంచలన విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది.

‘కె.జి.యఫ్ 2’.. రాకీ భాయ్ ఇండియన్ సినిమా హీరోయిజానికి బెంచ్ మార్క్ సెట్ చేశాడు ..

ఇటీవల విడుదల చేసిన ‘కె.జి.యఫ్ 2’ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఏ సినిమా టీజర్ సాధించలేని రికార్డ్ రాకీ భాయ్ క్రియేట్ చేశాడు. విడుదలైన కొద్ది గంటలకే 100 మిలియన్ల మార్క్ టచ్ చేసింది టీజర్.

KGF 2

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రైమ్ మినిస్టర్ రమికా సేన్ క్యారెక్టర్ చేస్తున్న రవీనా టాండన్‌తో పాటు కథానాయిక శ్రీనిధి శెట్టి, రాకీ తల్లి పాత్రలో ఆకట్టుకున్న అర్చన జాయిస్, కీలకపాత్రలో కనిపించనున్న ఈశ్వరి రావు, ఛీఫ్ ఎడిటర్ దీపా హెగ్డేగా నటించిన మాళవికా అవినాష్‌ల పోస్టర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగా వచ్చింది.

KGF 2

నేడు (మార్చి 26) విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన లుక్ రిలీజ్ చేశారు. విజయేంద్ర ఇంగల్గీ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్ లుక్ ఆకట్టుకుంటోంది. జూలై 16న ‘కె.జి.యఫ్ 2’ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Prakash Raj