Vijay – Sanjay : ‘ఉప్పెన’ రీమేక్‌తో విజయ్ తనయుడు సంజయ్ ఎంట్రీ..

తమిళ స్టార్ ‘దళపతి’ విజయ్ తనయుడు సంజయ్‌‌ను ‘ఉప్పెన’ రీమేక్‌తో హీరోగా పరిచయం చెయ్యాలని విజయ్ సేతుపతి సన్నాహాలు చేస్తున్నారు..

Vijay – Sanjay : ‘ఉప్పెన’ రీమేక్‌తో విజయ్ తనయుడు సంజయ్ ఎంట్రీ..

Kollywood Star Vijay Son Sanjay To Make Debut With Uppena Tamil Remake

Updated On : June 7, 2021 / 2:56 PM IST

Vijay – Sanjay: ‘ఉప్పెన’.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. బేబి, ఆశమ్మల ప్రేమకథకు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయ్యారు.. రిలీజ్ అయిన తక్కువ టైంలోనే వంద కోట్ల వసుళ్లు రాబట్టిన డెబ్యూ హీరోగా మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ రికార్డ్ సెట్ చేశాడు.

హీరో, హీరోయిన్లు, విజయ్ సేతుపతిల నటన, డీఎస్పీ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, కథ కథనాలు సినిమాకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచాయి. ఇటీవల ‘ఉప్పెన’ తమిళ్ రీమేక్ రైట్స్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి సొంతం చేసుకున్నారు. ముందుగా ఈ సినిమాను కోలీవుడ్‌లో ఓ పాపులర్ యంగ్ హీరోతో రీమేక్ చెయ్యాలకున్నారు సేతుపతి. ‘ఉప్పెన’ రీమేక్ పనులు కూడా స్టార్ట్ చేసేశారు..

కట్ చేస్తే ఈ సినిమాతో ఓ కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నారాయన.. తమిళ స్టార్ ‘దళపతి’ విజయ్ తనయుడు సంజయ్‌‌ను ‘ఉప్పెన’ రీమేక్‌తో హీరోగా పరిచయం చెయ్యాలని విజయ్ సేతుపతి సన్నాహాలు చేస్తున్నారు. ‘దళపతి’ విజయ్ కూడా ఈ సినిమాతోనే తనయుణ్ణి పరిచయం చెయ్యాలని ఫిక్స్ అయిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్.. సంజయ్ గతంలో పలు షార్ట్ ఫిలింస్ డైరెక్ట్ చేసి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తమ అభిమాన హీరో కొడుకు అరంగేట్రం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విజయ్ ఫ్యాన్స్..