తెలంగాణలో తెరుచుకున్న మద్యం షాపులు, బారులు తీరిన మందుబాబులు, కొత్త ధరలు ఇవే

తెలంగాణలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. బుధవారం(మే 6,2020) ఉదయం 10 గంటలకు మద్యం షాపులు ఓపెన్ చేసి విక్రయాలు స్టార్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 200 మద్యం దుకాణాల్లో(కంటైన్మెంట్ జోన్లలోని 15 దుకాణాలు మినహాయించి ) అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. లాక్ డౌన్ కారణంగా దాదాపుగా నెలన్నర రోజులకు(45) పైగా మద్యం షాపులు మూసివేసిన సంగతి తెలిసిందే. కేంద్రం పలు సడలింపులు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో మద్యం కొనేందుకు మందుబాబులు రెడీ అయిపోయారు. బుధవారం ఉదయాన్నే లిక్కర్ షాపుల దగ్గరికి చేరుకున్నారు. వైన్స్ షాపుల ముందు బారులు తీరారు.
ఉదయాన్నే మద్యం షాపుల దగ్గరకి చేరుకున్న మద్యం ప్రియులు:
సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయి. కంటైన్ మెంట్ జోన్లు మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్ అన్ని జోన్లలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. కంటైన్ మెంట్ జోన్లలో మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇన్నాళ్లు మద్యం దొరక్క విలవిలలాడిపోయిన మద్యం ప్రియులు, ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. మద్యం షాపులు తెరవడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. మందుబాటిళ్లు కొని వాటిని తాకి మురిసిపోతున్నారు. కొందరు ఫొటోలకు ఫోజులిస్తున్నారు.
కంటైన్ మెంట్ జోన్లు మినహా అన్ని జోన్లలో మద్యం విక్రయాలు:
మంగళవారం(మే 5,2020) కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6వరకు షాపు షాపులు తెరచుకోవచ్చని చెప్పారు. లిక్కర్ షాపుల దగ్గర భౌతిక దూరం తప్పనిసరని, మాస్క్ లేకుంటే మద్యం విక్రయించేందుకు అనుమతి లేదని, ఈ బాధ్యత దుకాణాల యజమానులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. రెడ్ జోన్లలోనూ అమ్మకాలు కొనసాగుతాయని, కంటైన్ మెంట్ జోన్ల పరిధిలో ఉన్న 15 మద్యం దుకాణాలను మాత్రం తెరిచేది లేదని అన్నారు. కాగా బార్లు, పబ్బులు, క్లబ్బులకు అనుమతి లేదన్నారు. అలాగే చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగతా బ్రాండ్లపై 16 శాతం మేర ధరలు పెంచారు.
కొత్త మద్యం ధరలు ఇవే:
మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించిన కొత్త ధరల వివరాలను వెల్లడించింది.
* ప్రతి బీర్‌పై రూ. 30 పెంపు
* చీప్ లిక్కర్ ఫుల్ బాటిల్‌పై రూ. 40 పెంపు
* ఆర్డినరి లిక్కర్ ఫుల్ బాటిల్‌పై రూ. 80 పెంపు
* ప్రీమియం లిక్కర్ ఫుల్ బాటిల్‌పై రూ. 120 పెంపు
* స్కాచ్ లిక్కర్ ఫుల్ బాటిల్‌పై రూ. 160 పెంపు
Also Read | ఏయే జోన్లలోనంటే? మద్యం విక్రయాలపై కేసీఆర్ క్లారిటీ