Maha Cabinet Expansion: 15న కేబినెట్ విస్తరణ.. ఫడ్నవీస్‭కు హోంశాఖ!

మహారాష్ట్రలో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ-రెబల్ శివసేన కలయికలో జూలై 30న నూతన ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఏక్‭నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ జూలై 30న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తైనప్పటికీ మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. మీడియా ప్రతినిధులు, ఇతరులు మంత్రివర్గ విస్తరణ గురించి ప్రశ్నించిన ప్రతీసారి తొందర్లోనే ఏర్పాటు చేస్తామంటూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా నాన్చుతూ వచ్చారు.

Maha Cabinet Expansion: 15న కేబినెట్ విస్తరణ.. ఫడ్నవీస్‭కు హోంశాఖ!

Maha cabinet expansion Fadnavis may get home min

Updated On : August 8, 2022 / 3:04 PM IST

Maha Cabinet Expansion: ఈ నెల 15న మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర బీజేపీ కీలక నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‭కు హోంమంత్రి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత మంత్రివర్గ విస్తరణ ఈ నెల 5నే జరుగుతుందని చెప్పటినప్పటికీ కొన్ని కారణాల వల్ల మళ్లీ 15కు వాయిదా వేశారు. జూన్ 30 నుంచి కేవలం ఇద్దరితోనే (ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి) ఉన్న కేబినెట్ విస్తరణ జరగడానికి నెలకు పైగానే సమయం తీసుకున్నారు.

నూతనంగా ఏర్పడే మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎనిమిది మంది, షిండే వర్గం నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసలు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారా అనే ప్రశ్నలు, విమర్శలు షిండే ప్రభుత్వాన్ని కొద్ది రోజులుగా వెంటాడుతున్నాయి. ఈ విషయమై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చే జరుగుతోంది. ఈ ఉత్కంఠకు తెర దించాలని షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మంత్రివర్గ విస్తరణకు పూనుకుంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన నీతి అయోగ్ సమావేశానికి షిండే హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం కూడా మంత్రి వర్గ విస్తరణపై బజీపీ పెద్దలతో షిండే మాట్లాడినట్లు సమాచారం.

బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ మునగంటీవార్, గిరిష్ మహాజన్, ప్రవీణ్ దరేకర్, రాధాకృష్ణ వీకే పాటిల్, రవి చవాన్, బబనరావ్ లోణికార్, నితేష్ రాణెలకు చోటు దక్కుతుండగా.. షిండే వర్గం నుంచి దాదా భూసే, దీపక్ కేసర్‭కర్, శంభూ రాజె దేశాయ్, సందీపన్ భుమ్రే, సంజయ్ శిర్‭సాఠో, అబ్దుల్ సత్తారి, బచ్చూ కడూ(లేదంటే రవి రాణా)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం రాజ్‭భవన్‭లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వీరి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

మహారాష్ట్రలో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ-రెబల్ శివసేన కలయికలో జూలై 30న నూతన ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఏక్‭నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ జూలై 30న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తైనప్పటికీ మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. మీడియా ప్రతినిధులు, ఇతరులు మంత్రివర్గ విస్తరణ గురించి ప్రశ్నించిన ప్రతీసారి తొందర్లోనే ఏర్పాటు చేస్తామంటూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా నాన్చుతూ వచ్చారు. ఈ విషయమై విపక్షాలు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలె కొద్ది రోజుల క్రితం మహా ప్రభుత్వాన్ని ‘ఏక్ దుజే కే లియే’(అన్యోన్యమైన జంట) అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

BJP vs Nitish: బీజేపీతో విభేదాలకు కారణాలు ఇవే..!