SSMB : మహేష్ బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 43 ఏళ్ళు.. #43YearsForSSMBReignInTFI

మహేష్ బాబు మొట్టమొదటిసారి నాలుగేళ్ల వయసులో వెండితెరపై కనిపించారు. మహేష్ అన్నయ్య, కృష్ణ తనయుడు రమేష్ బాబు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నీడ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మొదటి సారి మహేష్ నాలుగేళ్లప్పుడు నటించాడు...............

SSMB : మహేష్ బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 43 ఏళ్ళు.. #43YearsForSSMBReignInTFI

Mahesh Babu completed 43 years in TFI

Updated On : November 29, 2022 / 1:00 PM IST

SSMB :  ఇటీవలే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించి ఆయన బాధలో ఉన్నారు. అయితే నేటికి సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి 43 ఏళ్ళు అయింది. అదేంటి మహేష్ ఇండస్ట్రీకి వచ్చి 43 ఏళ్ళు అయిందా అనుకుంటున్నారా. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.

మహేష్ బాబు మొట్టమొదటిసారి నాలుగేళ్ల వయసులో వెండితెరపై కనిపించారు. మహేష్ అన్నయ్య, కృష్ణ తనయుడు రమేష్ బాబు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నీడ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మొదటి సారి మహేష్ నాలుగేళ్లప్పుడు నటించాడు.

Dil Raju : తెలుసుకోకుండా, చూడకుండా డబ్బు పెట్టి కొనేది సినిమా డిస్ట్రిబ్యూటర్‌లు మాత్రమే.. దిల్ రాజు!

ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 43 సంవత్సరాలు అవుతుండటంతో మహేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చి 43 ఏళ్ళు అయిందని అభిమానులు #43YearsForSSMBReignInTFI అని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక నీడ సినిమాలో హీరో, మహేష్ అన్నయ్య రమేష్ బాబు కూడా కొన్ని నెలల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. నీడ సినిమా 1979 నవంబర్ 29న రిలీజయింది.