Mahesh Babu : నాన్న నాకు ఎన్నో ఇచ్చాడు.. అందులో గొప్పది మీ అభిమానం.. మహేష్ బాబు!
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ ఇటీవల అనారోగ్య సమస్యల వల్ల మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో సూపర్ స్టార్ అభిమానుల మధ్య కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించాడు మహేష్ బాబు. ఈ క్రమంలోనే మహేష్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. మా నాన్న నాకు ఎన్నో ఇచ్చాడు. అందులో..

Mahesh Babu Emotional words at Krishna memorial function
Mahesh Babu : టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ ఇటీవల అనారోగ్య సమస్యల వల్ల మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో సూపర్ స్టార్ అభిమానుల మధ్య కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించాడు మహేష్ బాబు. ఈ కారిక్రమానికి అభిమానులతో పాటు కుటుంబ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి.. కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Mahesh Babu: షూటింగ్కు రెడీ అవుతున్న మహేష్..?
ఈ క్రమంలోనే మహేష్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. “మా నాన్న నాకు ఎన్నో ఇచ్చాడు. అందులో గొప్పది మీ అభిమానం. ఇంతటి అభిమానాన్ని నాకు అందించినందుకు, నేను ఎప్పటికి ఆయనకు రుణపడి ఉంటా. అయన ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. అయన ఎప్పటికి మీ గుండెల్లో ఉంటారు. అయన ఎప్పుడు మన మధ్యనే ఉంటారు.
మీరందరు ఇక్కడకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, అశీసులు ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అంటూ వ్యాఖ్యానించాడు. ఇక గత కొంతకాలంగా శోకసంద్రంలో ఉన్న తన అభిమాన హీరో మహేష్ ని ఓదార్చడానికి.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు ఈ కారిక్రమానికి తరలి వచ్చారు.