Sarkaru Vari Paata: అవుట్ అండ్ అవుట్ యాసలో మహేష్ మాటాల తూటాలు?!

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత క్లాస్ గా కనిపిస్తారో అంత మాస్ లుక్ లోకి మారిపోగలడు. నిజజీవితంలో కూడా చూసేందుకు మహేష్ క్లాస్ గా కనిపిస్తాడు కానీ మాటలలో మాత్రం పల్లెటూరి యాస కనిపిస్తుంది.

Sarkaru Vari Paata: అవుట్ అండ్ అవుట్ యాసలో మహేష్ మాటాల తూటాలు?!

Mahesh Babu Out And Out Mass Dialogues In Sarkaru Vari Paata

Updated On : May 28, 2021 / 5:56 PM IST

Sarkaru Vari Paata: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత క్లాస్ గా కనిపిస్తారో అంత మాస్ లుక్ లోకి మారిపోగలడు. నిజజీవితంలో కూడా చూసేందుకు మహేష్ క్లాస్ గా కనిపిస్తాడు కానీ మాటలలో మాత్రం పల్లెటూరి యాస కనిపిస్తుంది. చిన్నతనంలో అమ్మమ్మ ఇంట్లో పెరగడంతోనే ఆ యాస బాగా వచ్చేసిందని మహేష్ పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అదే సినిమాలలో పలు సందర్భాలలో బాగా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు.

కాగా.. పోకిరి, అతిధి తర్వాత మహేష్ మళ్ళీ పక్కా మాస్ లుక్ లో కనిపించేందుకు అవకాశం లేకుండా పోయింది. సరిలేరు నీకెవ్వరూ.. భరత్ అనే నేను వంటి సినిమాలలో కాస్త అప్పుడప్పుడు మాస్ ఎలిమెంట్స్ కనిపించినా పోకిరి రేంజ్లో మాస్ ఆడియన్స్ ఊగిపోయేంత సన్నివేశాలు కనిపించలేదు. అయితే.. రాబోయే సర్కారు వారి పాటతో ఆ లోటు భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. పక్కా మాస్ సన్నివేశాలతో పాటు మాస్ డైలాగులు కూడా ఈ సినిమాలో ఆకట్టుకుంటాయట.

ఇప్పటికే లుక్ పరంగా మాస్ ప్రేక్షకులకు హింట్ ఇచ్చిన దర్శకుడు పరుశురాం.. మహేష్ ను కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ గాను ప్రత్యేక యాసలో కూడా మాటల తూటాలు పేల్చేలా సీన్స్ రాసుకున్నట్లు తెలుస్తుంది. పరశురామ్ పెన్నింగ్ పై మహేష్ అభిమానులు ఓ స్థాయిలో అంచనాలు పెట్టుకోగా.. అప్పుడప్పుడు ఇచ్చే ఇలాంటి లీకులు సినిమా మీద మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరి అంచనాలకు తగ్గట్లే సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.