Mahesh Babu: ప్లాప్ దర్శకుడికి మహేష్ మరో అవకాశం.. అంత నమ్మకమేంటో?

ఒక్కోసారి మన హీరోలు ఒకసారి పనిచేసి.. బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన దర్శకులకు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తుంటారు. అయితే, తొలిసారే ప్లాప్ సినిమా అయితే ఆ దర్శకుడికి మళ్ళీ ఆ హీరో నుండి అవకాశం రావడం చాలా కష్టం.

Mahesh Babu: ప్లాప్ దర్శకుడికి మహేష్ మరో అవకాశం.. అంత నమ్మకమేంటో?

Mahesh Is Another Chance For Murugadoss Is He So Confident

Updated On : June 6, 2021 / 4:23 PM IST

Mahesh Babu: ఒక్కోసారి మన హీరోలు ఒకసారి పనిచేసి.. బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన దర్శకులకు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తుంటారు. అయితే, తొలిసారే ప్లాప్ సినిమా అయితే ఆ దర్శకుడికి మళ్ళీ ఆ హీరో నుండి అవకాశం రావడం చాలా కష్టం. కానీ ఒక్కోసారి దర్శకుడి పనితనం, కోఆర్డినేషన్ కారణంగా కూడా దర్శకుడికి ఆ హీరోతోనే మళ్ళీ అవకాశం వస్తుంది. అలానే ఇప్పుడు మహేష్ కూడా ఓ ప్లాప్ దర్శకుడికి మరోసారి అవకాశం ఇస్తున్నాడని అనిపిస్తుంది.

తమిళ దర్శకుడు మురుగదాస్ సినిమాల గురించి, తన టాలెంట్ గురించి మనకి కూడా తెలిసిందే. గజినీ లాంటి సౌత్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్ళీ హిందీలో కూడా రీమేక్ చేసి మెప్పించిన ఘనత మురుగదాస్ దే. మెగాస్టార్ చిరంజీవితో కూడా స్టాలిన్ సినిమాను తెరకెక్కించిన ఈ దర్శకుడి తమిళ సినిమా రీమేక్ గా రూపొందిందే ఖైదీ NO: 150. ఆ నమ్మకం మీదనే మహేష్ తొలిసారి స్పైడర్ సినిమాకి అవకాశం ఇచ్చాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఆ సినిమా మన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.

అయితే, మహేష్ మురుగదాస్ కు మరోసారి అవకాశం ఇవ్వనున్నాడట. ఆ మధ్య ఒక సందర్భంలో మహేష్ స్వయంగా మరోసారి మురుగదాస్ తో పనిచేస్తానని చెప్పడంతోనే ఈ ప్రచారం మొదలైంది. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. మరోవైపు రాజమౌళితో సినిమా చర్చలు జరుగుతున్నాయి. మధ్యలో త్రివిక్రమ్ తో సినిమా కూడా ఉంది. అయితే.. రాజమౌళి కంటే ముందే మురుగదాస్ తో మరో సినిమా చేసే అవకాశం ఉందని.. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే!