అమ్మా నాన్నలకు చరణ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు..

అమ్మా నాన్నలకు చరణ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు..

Updated On : February 20, 2021 / 12:40 PM IST

Chiranjeevi 42nd Wedding Anniversary: మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఫిబ్రవరి 20న వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. మెగా దంపతుల 42వ పెళ్లిరోజు ఇది. ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తల్లిదండ్రులకు సోషల్ మీడియా ద్వారా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.

1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. 2021 ఫిబ్రవరి 20 కి వీరి వివాహం జరిగి 42 వసంతాలవుతోంది. ‘‘నా అతి పెద్ద బలం.. మీకు 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

చిరు ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. శ్రీమతి సురేఖ సమర్పణలో చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే సిద్ధ అనే కీలకపాత్రలో కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు చెర్రీ.]