Munugode By Poll : వాళ్లు కోమటిరెడ్లు కాదు కోవర్టు రెడ్లు : కేటీఆర్

వాళ్లు కోమటిరెడ్లు కాదు కోవర్టు రెడ్లు అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి కేటీఆర్ విమర్శలు సంధించారు.

Munugode By Poll : వాళ్లు కోమటిరెడ్లు కాదు కోవర్టు రెడ్లు : కేటీఆర్

Komatireddy brothers are covert reddies

Updated On : October 11, 2022 / 3:09 PM IST

Munugode By Poll : మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల నేతలు మాటలతో యుద్ధాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీ పైనా కోమటిరెడ్డి బ్రదర్స్ పై మండిపడ్డారు. తనదైన శైలిలో కేటీఆర్ విమర్శలు సంధించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తున్నాను..కేసీఆర్ అవినీతిపై పోరాటం చేయటానికి పార్టీ వీడుతున్నానంటూ చెప్పి కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు కేటీఆర్. కాంట్రాక్టుల కోసం బీజేపీలోకి వెళ్లి న్యాయపోరాటం కోసం అనే రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అంతేకాదు కోమటిరెడ్డి బ్రదర్స్ ని వాళ్లు కోమిరెడ్లు కాదు కోవర్టు రెడ్లు అంటూ ఎద్దేవా చేశారు.

మునుగోడోలు టీఆర్ఎస్ విజయం ఖాయం అని ధీమా వ్యక్తంచేసిన కేటీఆర్ బీజేపీకి, కాంగ్రెసు లకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ ను ఉద్ధేశించి ఒక కాంట్రాక్టరు బలుపు..అహంకారం వల్లే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. మిషన్ భగీరథ పథకంతో నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యను తరిమి కొట్టిన ఘతన కేసీఆర్ ది అయితే కాంట్రాక్టుల కోసం పార్టీని వీడిన చరిత్ర కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిది అని త్వరలోనే ఆయన సోదరుడు వెంకట్ రెడ్డికూడా పార్టీ మారుతాడు అంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. నల్గొండ అభివృద్ధికి రూ.18వేల కోట్లు ఇస్తే టీఆర్ఎప్ పార్టీ మునుగోడు ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

కేంద్రంలో ఉన్న బీజేపీ టీఆర్ఎస్ పార్టీని భయపెట్టటానికి ఎన్నో పాట్లు పడుతోందన్న కేటీఆర్ ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి భయపెట్టాలనుకుంటోందని తప్పు చేయని మేం ఎవ్వరికి భయపడే ప్రసక్తే లేదని మోడీ..ఈడీ కలిసి వచ్చినా మా వెంట్రుక కూడా పీకలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

మునుగొడులో గెలుపు కోసం బీజేపీ రూ. 5వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది అంటూ కేటీఆర్ ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినట్లు…18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చినట్లుగా నల్గొండ అభివృద్ధికి 18వేల కోట్లు బీజేపీ ఇస్తే టీఆరెస్ పోటీ నుంచి తప్పుకుటుంది అని చెప్పుకొచ్చారు.

తాను మునుగోడు అభివృద్ధి కోసం పార్టీ మారనని చెప్పుకుంటున్న రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం పార్టీ మారలేదని ప్రజల కోసమే మారానని ప్రమాణం చేసి చెప్పగలరా? అంటూ ఛాలెంజ్ చేశారు. మేం అవినీతికి పాల్పడ్డాం అని విమర్శిస్తున్న రాజగోపాల్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ కోరు..లేదంటే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బండి సంజయ్పై ప్రమాణం చేయి ..అక్కడ కాదంటే యాదాద్రి ఆలయానికిరా అంటూ అంటూ సవాల్ చేశారు.