Smriti Irani Warn Son in law :‘నాలాంటి అత్తతో జాగ్రత్త’..కాబోయే అల్లుడికి మంత్రి స్మృతి ఇరానీ వార్నింగ్

‘నాలాంటి అత్తతో జాగ్రత్త’..కాబోయే అల్లుడికి కేంద్రం మంత్రి స్మృతి ఇరానీ వార్నింగ్ ఇచ్చారు.

Smriti Irani Warn Son in law :‘నాలాంటి అత్తతో జాగ్రత్త’..కాబోయే అల్లుడికి మంత్రి స్మృతి ఇరానీ వార్నింగ్

Smriti Irani Warn Son In Law

Updated On : December 27, 2021 / 4:19 PM IST

Ministe smriti irani warn son in law : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియా వేదికగా కాబోయే అల్లుడికి వార్నింగ్ ఇచ్చారు. ‘‘నాలాంటి అత్తతో జాగ్రత్త..అంటూ కాబోయే అల్లుడు అర్జున్ భల్లాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘మామ‌గా ఓ క్రేజీ వ్య‌క్తిని ఎనుకున్నావ్..కానీ అత్తనైన త‌న‌తోనూ జాగ్ర‌త్త‌గా ఉండాలి’ అంటూ మంత్రి స్మృతి ఇరానీ త‌న ఇన్ స్టా పోస్టులో అల్లుడు అర్జున్‌ను స‌ర‌దాగా హెచ్చ‌రించారు.స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. తన ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతుంటారు. తన కుటుంబ సభ్యులతో సరదాగా ఉండే ఫోటోలను పోస్టు చేస్తుంటారు.

Read more : Niti Ayog Report : ఆరోగ్య రంగంలో 3వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో AP

ఈ సందర్భంగా స్మృతి ఇరానీ కూతురు షానెల్లి ఎంగేజ్మెంట్ వార్త‌ను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. బాయ్‌ఫ్రెండ్ అర్జున్ భ‌ల్లాతో షానెల్లి ఇరానీ నిశ్చితార్ధం జ‌రిగింది. మోకాళ్ల‌పై కూర్చుని కాబోయే భార్య‌కు అర్జున్ రింగ్ తొడుగుతున్న ఫోటోను మంత్రి ఇరానీ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. దానికి ఓ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. మా లాంటి గుండె క‌లిగిన కుటుంబంలోకి వ‌స్తున్న అర్జున్ భ‌ల్లాకు స్వాగ‌తం ప‌లికిన మంత్రి ఇరానీ.. ఆ త‌ర్వాత త‌న అల్లుడికి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

మామ‌గా ఓ క్రేజీ వ్య‌క్తిని ఎనుకున్నావ్..ఇక అత్తనైన త‌న‌తోనూ జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ స్మృతి ఇరానీ త‌న పోస్టులో అల్లుడు అర్జున్‌ను స‌ర‌దాగా హెచ్చ‌రించారు. అఫీషియ‌ల్‌గా వార్నింగ్ ఇస్తున్నాని..దేవుడు మిమ్ముల్ని దీవించాల‌ని కోరుతున్న‌ట్లు త‌న పోస్టులో మంత్రి స్మృతి ఇరానీ సరదా సరదా కామెంట్స్ పెట్టారు. స్మృతి ఇరానీ భ‌ర్త జుబిన్ ఇరానీ. జుబిన్ ఇరానీ మొద‌టి భార్య మోనా ఇరానీ. ఆమెకు పుట్టిన అమ్మాయే షానెల్లి ఇరానీ.

Read more : Viral Video: ఛెంగుమని పరుగెడుతున్న జింక మంచు శిలలా గడ్డకట్టుకుపోయింది..

స్మృతి ఇరానీ ఫోటోను షేర్ చేసిన వెంటనే..ఆమె అభిమానులు..స్నేహితులు షానెల్లి జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా..స్మృతి ఇరానీ 2001లో జుబిన్ ఇరానీని వివాహం చేసుకున్నారు.వీరికి జోర్, జోయిష్ అనే అనే ఇద్దరు కుమారులున్నారు. అంటే షానెల్లికి మంత్రి స్మృతి స్టెప్ మదర్.