Viral Video: ఛెంగుమని పరుగెడుతున్న జింక మంచు శిలలా గడ్డకట్టుకుపోయింది..

ఛెంగుమని పరుగెడుతున్న జింక మంచు శిలలా గడ్డకట్టుకుపోయింది..

Viral Video: ఛెంగుమని పరుగెడుతున్న జింక మంచు శిలలా గడ్డకట్టుకుపోయింది..

Kazakhstan Frozen Deer

Kazakhstan Frozen Deer : శీతాకాలం. చలి వణికిస్తోంది. అదే కిజకిస్థాన్ లో అయితే రక్తం గడ్డకట్టిపోయేంత మంచు కురుస్తోంది. ఈ మంచులో ఓ జింక ఛెంగు ఛెంగున గెంతులేస్తోంది. కానీ సడెన్ గా మంచు శిల్పంలా మారిపోయింది. అంటే అక్కడ చలి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఉష్ణోగ్రతలు అత్యంత దారునంగా పడిపోతున్నాయి. ఇటువంటి వాతావరణంలో మనుగడ సాగించే జంతువులు కూడా అత్యల్పంగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలో జంతువులకు ప్రాణ సంకటే. ఇటువంటి వాతావరణంలో ఓ హృదయవిదాకర ఘటన ఒకటి జరిగింది.

Read more : Pope Francis : పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారంటూ లైవ్ టెలికాస్ట్ లో ప్రకటించిన యాంకర్

నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ జింక గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుండెలు పిండేసేలా ఉన్న ఈవీడియో చూసినవారం ఎంత దారుణం..అప్పటివరకు చక్కగా ఉన్న జింక అంతలోనే ఎలా మంచు శిల్పంలా గడ్డకట్టిపోయిందో అని వాపోతున్నారు.

ఈ వీడియోలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న జింకను కనిపిస్తోంది. అది నోరుతో సహా శరీరం మొత్తం గడ్డకట్టినట్లు కనిపిస్తుంది. జింక పారిపోవడానికి ప్రయత్నించిన వెంటనే, అక్కడికక్కడే మంచుతో గడ్డకట్టుకుపోయింది. అటువంటి పరిస్థితిలో, ఒక స్థానిక వ్యక్తి దానిని పట్టుకుని, అతని శరీరం నుండి మంచును తొలగించాడు. దీంతో ఆ జింకకు గొప్ప ఉపశమనం పాపం కాస్త కలిగింది. వెంటనే గంతులేసుకుంటూ చెంగు చెంగున పరుగులు పెడుతు వెళ్లిపోయింది.

Read more : Covid Vaccine: వ్యాక్సిన్ వేయించుకోమన్నందుకు పోలీస్‌ అధికారి చెయ్యి విరగ్గొట్టిన వ్యక్తి

 

View this post on Instagram

 

A post shared by Meme wala (@memewalanews)