Pope Francis : పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారంటూ లైవ్ టెలికాస్ట్ లో ప్రకటించిన యాంకర్

పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారంటూ లైవ్ టెలికాస్ట్ లో ప్రకటించిన టీవీ యాంకర్.

Pope Francis : పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారంటూ లైవ్ టెలికాస్ట్ లో ప్రకటించిన యాంకర్

Journalist Wrongly Announces Popes Death In Live Tv

Journalist Wrongly Announces Popes Death In Live TV : పెద్ద పొరపాటే జరిగింది. క్రైస్తవ ఆథ్యాత్మిక గురువైన పోప్ చనిపోయారని ఓ టీవీ చానల్ ఏకంగా లైవ్ లో ప్రకటించింది. క్రీస్తు పుట్టిన రోజు డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ రోజున పోప్ చనిపోయారు అంటూ ITV న్యూస్ లైవ్ టెలికాస్ట్ లో న్యూస్ ప్రజెంటర్ కైలీ పెంటె పొరపాటున పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారని ప్రకటించారు. కానీ కాసేపటికే ఆమె ఈ విషయాన్ని గ్రహించి క్షమాపణలు చెప్పారు.

Read more : Covid Vaccine: వ్యాక్సిన్ వేయించుకోమన్నందుకు పోలీస్‌ అధికారి చెయ్యి విరగ్గొట్టిన వ్యక్తి

ఏసు పుట్టిన రోజు అయిన క్రిస్మస్ పండుగ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ అన్ని దేశాల్లోను కరోనా వ్యాక్సిన్ ప్రాముఖ్యత గురించి చెబుతు ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిస్తున్న సందర్భంగా ITV న్యూస్ లైవ్ టెలికాస్ట్ చేసింది. ఈ కార్యక్రమాన్ని టెలికాస్టు చేస్తు..న్యూస్ ప్రజెంటర్ పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడిని మాటలను చెబుతు పొరపాటున పోప్ మరణించారని ప్రకటిచింది. కానీ వెంటనే తేరుకుని క్షమాపణలు కోరింది. కానీ నెటిజన్లు మాత్రం సదరు టీవీ చానల్ ని..ఆ న్యూస్ ప్రెజెంటర్ ను తిట్టిపోస్తున్నారు. అంత పెద్ద పొరపాటుపై మండిపడ్డారు. గతంలో మీడియా చేసిన ఇలాంటి పొరపాట్లను షేర్ చేస్తున్నారు.

Read more : Omicron World : ప్రపంచంపై ఒమిక్రాన్ పంజా..ఆస్ట్రేలియాలో తొలి మరణం!