Covid Vaccine: వ్యాక్సిన్ వేయించుకోమన్నందుకు పోలీస్‌ అధికారి చెయ్యి విరగ్గొట్టిన వ్యక్తి

కరోనా వ్యాక్సిన్ వేయించుకోమన్నందుకు పోలీస్‌ అధికారి చెయ్యి విరగ్గొట్టాడు ఓ వ్యక్తి.

Covid Vaccine: వ్యాక్సిన్ వేయించుకోమన్నందుకు పోలీస్‌ అధికారి చెయ్యి విరగ్గొట్టిన వ్యక్తి

Covid

Man Breaks Cop’s Hand During Vaccination Campaign:  కరోనా వ్యాక్సిన్ వచ్చి సంవత్సరం అవుతున్నా..ఈనాటికీ చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇష్టపడటంలేదు. ఈక్రమంలో ఓ వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిది..ఈ ఒమిక్రాన్ వేరియంట్ పెరుగుతున్న తరుణంలో వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని చెప్పిన ఓ పోలీస్‌ అధికారిపై ఓ వ్యక్తి ఏకంగా దాడికి తెగబడ్డాడు.పోలీసు అని కూడా చూడకుండా..భయపడకుండా ఏకంగా పోలీసు అధికారి చెయ్యి విరగ్గొట్టాడు. ఆతరువాత భయపడి పారిపోయాడు తప్ప వ్యాక్సిన్ మాత్రం వేయించుకోలేదు.

Read more : Villagers Attack On Vaccine Team : వ్యాక్సిన్ వేయటానికి వచ్చిన సిబ్బందిపై కర్రలతో గ్రామస్తులు దాడి

ఝార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లాలో ఆదివారం (డిసెంబర్ 26,2021)మహువర్‌ గ్రామ ప్రజలను టీకాలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తు వైద్య సిబ్బంది వచ్చారు. వారితోపాటు కృష్ణ కుమార్‌ మరాండి అనే ఓ పోలీస్‌ అధికారికూడా వచ్చారు. అలా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెబుతున్న క్రమంలో రామచంద్ర ఠాకుర్‌ అనే వ్యక్తి అతనితో పాటు కుటుంబ సభ్యులు అందరు మేం వ్యాక్సిన్ వేయించుకోం అంటూ కరాఖండీగా చెప్పారు.

దీంతో కృష్ణ కుమార్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవటం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అని వివరించటం మొదలుపెట్టారు. అలా రామచంద్ర ఠాకూర్ ను అతని కుటుంబ సభ్యులకు పదే పదే నచ్చచెప్పాడు. అలా వారు వ్యాక్సిన్ వేయించుకునే నచ్చి చెప్పి ఒప్పించడానికి యత్నించారు. ఈక్రమంలో రామచంద్ర ఠాకూర్ వద్దంటే వినరేంటి..మా ఇష్టం మేం వేయించుకోం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు.

Read more : covid-19 vaccine : నాకు బలవంతంగా వ్యాక్సిన్ వేయాలని చూస్తే ఊరు వదిలిపోతా

అక్కడితో ఊరుకోకుండా ఠాకుర్‌ అక్కడే ఉన్న ఓ కర్ర తీసుకుని పోలీసులు అధికారి కృష్ణకుమార్ పై దాడికి దిగాడు. ఏకంగా కర్రతో కృష్ణ కుమార్ చెయ్యిపై బలంగా కొట్టాడు. ఆదాడికి అతని చేయి విరిగింది. దీంతో భయపడిపోయిన ఠాకుర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది కృష్ణ కుమార్‌ కు ఫస్ట్ ఎయిడ్ చేసి..ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణకుమార్ చికిత్స పొందుతున్నారు. ఠాకుర్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read more : Threat vaccination staff with snake : ‘నాకు వ్యాక్సిన్ వేసారో..పాముతో కరిపిస్తా జాగ్రత్త’ : మహిళ బెదిరింపు