covid-19 vaccine : నాకు బలవంతంగా వ్యాక్సిన్ వేయాలని చూస్తే ఊరు వదిలిపోతా

కరోనా వ్యాక్సిన్ మత్తుమందు..నాకు బలవంతంగా వేయాలని చూస్తే ఊరు వదిలిపోతా అంటూ ఓ వ్యక్తి నానా హంగామా చేశారు. ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. ఇంటికి తాళం పెట్టి మరీ పారిపోయాడు.

covid-19 vaccine : నాకు బలవంతంగా వ్యాక్సిన్ వేయాలని చూస్తే ఊరు వదిలిపోతా

You Give Me A Covid Vaccine I Will Leave The Village

you give me a covid vaccine i will leave the village : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రపంచం అంతా మరోసారి భయపడుతోంది. కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ వచ్చి దాదాపు ఏడాది దాటుతోంది. కానీ ఈనాటికి చాలామంది వ్యాక్సిన్ వేసుకోటానికి ఇష్టపడట్లేదు. అపోహలు,భయాలతో వ్యాక్సిన్ వేయించుకోవట్లేదు. ఈక్రమంలో తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఆరోగ్యకార్యకర్తలు ఓ వ్యక్తికి వ్యాక్సిన్ వేయటానికి యత్నించారు. కానీ అతను వేయించుకోను అంటూ నానా హంగామా చేశాడు. ‘‘కరోనా టీకా ఓ మత్తు మందు.. నేను వేసుకోను..అంటూ నానా హంగామా చేశారు.

Read more : Covid vaccine : నా శివయ్య కరోనా వ్యాక్సిన్ వేయించుకోవద్దని చెప్పాడు..రోడ్డుపై మహిళ వీరంగం

ఈ వింత ఘటన సోమవారం (డిసెంబర్ 6,2021) జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రొండి ఎల్లయ్య అనే వ్యక్తి ఇంకా ఒక్క డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. దాంతో ఆశావర్కర్లు అతనికి వ్యాక్సిన్ వేయటానికి వెళ్లారు. కానీ వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఎల్లయ్య నిరాకరించాడు. ఆశావర్కర్లు ఎల్లయ్యకు పదే పదే నచ్చచెప్పారు. కానీ ఎల్లయ్య మాత్రం వినలేదు. దీంతో ఆశావర్కర్లు ఈ విషయాన్ని సర్పంచ్ కు తెలియజేశారు. వెంటనే సర్పంచ్ భర్త బింగి వేణు అక్కడకు వచ్చి.. టీకా వేయించుకోవాలి ఎల్లయ్యా..లేదంటే ప్రమాదం అని చెప్పారు. కానీ ఎల్లయ్య మాత్రం సర్పంచ్ మాటల్ని కూడా వినలేదు. వేయించుకోను అంటే వేయించుకోను అంటూ ఖరాకండీగా చెప్పాడు.

Read more : Threat vaccination staff with snake : ‘నాకు వ్యాక్సిన్ వేసారో..పాముతో కరిపిస్తా జాగ్రత్త’ : మహిళ బెదిరింపు

ఎందుకు వేయించుకోనంటున్నావ్ అని ప్రశ్నించగా..‘‘కరోనా టీకా ఓ మత్తు మందు..అందుకే నేను వేయించుకోను..కాదు కూడదని నాకు బలవంతంగా వేసుకోమంటే ఊరు విడిచి వెళ్లిపోతాను అంతేకాదు వేయించుకునేది లేదని తెగేసి చెప్పాడు. ఎంతచెప్పినా వినకపోవడంతో.. మరుసటి రోజు వచ్చి చూసే సరికి ఇంటికి గొళ్లెం పెట్టి ఎక్కడకో వెళ్లిపోయాడు.

Read more : Corona Vaccination Fear : వ్యాక్సిన్ మాకొద్దు బాబోయ్ అంటూ…నదిలో దూకి పారిపోయిన గ్రామస్తులు
కాగా..ప్రపంచంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ దేశాలను భయపెడుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ కేసులో ఇండియాలో 21 నమోదయ్యాయి. దాంతో వ్యాక్సినేషన్ లో అధికారులు వేగం పెంచారు. అయితే ఇంకా కొంతమంది మాత్రం వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి వ్యాక్సిన్ వేయడానికి ఆశా వర్కర్లు వెళ్తే.. ఊరైనా విడిచిపోతా కానీ వ్యాక్సిన్ మాత్రం వేసుకోనని తెగేసి చెప్పాడు.

Read more : Villagers Attack On Vaccine Team : వ్యాక్సిన్ వేయటానికి వచ్చిన సిబ్బందిపై కర్రలతో గ్రామస్తులు దాడి