Covid vaccine : నా శివయ్య కరోనా వ్యాక్సిన్ వేయించుకోవద్దని చెప్పాడు..రోడ్డుపై మహిళ వీరంగం

నా శివయ్య కరోనా వ్యాక్సిన్ వేయించుకోవద్దని చెప్పాడు.. దయచేసిన నాకు వ్యాక్సిన్ వేయొద్దు అంటూ .రోడ్డుపై ఓమహిళ నానా హడావిడీ చేసింది.

Covid vaccine : నా శివయ్య కరోనా వ్యాక్సిన్ వేయించుకోవద్దని చెప్పాడు..రోడ్డుపై మహిళ వీరంగం

Covid Vaccine

Covid-19  vaccine : కరోనా వ్యాక్సిన్ వచ్చి ఇంతకాలం అవుతున్నా ఇంకా టీకా వేయించుకోవటానికి భయపడుతున్నారు చాలామంది. కొంతమంది అయితే దాన్నో భూతంలా చూస్తున్నారు. మరికొందరు లేనిపోని అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఆసక్తి చూపించట్లేదు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఓమహిళ వ్యాక్సిన్ వేయించుకోమని చెబుతున్న అధికారులపై మండిపడింది. నేను శివయ్య భక్తురాలిని శివయ్య వ్యాక్సిన్ వేయించుకోవద్దని చెప్పాడు.కాబట్టి నేను వ్యాక్సిన్ వేయించుకోనంటే వేయించుకోను అంటూ అధికారులపై మండి పండింది.దానికి అధికారలు అదికాదమ్మా..అని నచ్చచెప్పటానికి యత్నిస్తుంటే మీరు ఇక్కడనుంచి వెళ్లకుపోతే బాగుండదు జాగ్రత్త అంటూ వాళ్ల కళ్లుమందే రోడ్డుపైకి వచ్చి నానా రచ్చా చేసింది. రోడ్డుమీద దొర్లుతూ నానా హడావిడీ చేసింది.

Read more : Corona Vaccination Fear : వ్యాక్సిన్ మాకొద్దు బాబోయ్ అంటూ…నదిలో దూకి పారిపోయిన గ్రామస్తులు

మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లోని ఆఠ్నెర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నథ్యూఢానా గ్రామంలో ఓ మహిళ వ్యాక్సిన్ వేయించుకోనంటూ భీష్మించుకుని కూర్చోవటంతో వైద్య ఆమెకు నచ్చజెప్పి వ్యాక్సిన్ వేయటానికి మొత్తం వైద్యబృందమంతా కదిలి వచ్చింది. ఆమె ఓ చిన్నపాటి దేవాలయంలో ఉండటంతో అక్కడికే వచ్చారు అధికారులు. వారిని చూసిన ఆ మహిళ మహాశివుని విగ్రహంపై చేయిపెట్టి… ‘నా శివయ్య కరోనా వ్యాక్సిన్ ఇంజక్షన్ వేయించుకోవద్దని ఆదేశించాడు. అందుకే నేను వ్యాక్సిన్ వేయించుకోను’ అని చెప్పింది.

అది విన్న వైద్యబృందం బిత్తరపోయింది. ఆమెకు మరోసారి వ్యాక్సిన్‌పై అవగాహన కలిగించే ప్రయత్నం చేయటంతో ఆమె హఠాత్తుగా అధికారుల వారి కాళ్లపై బోర్లా పడిపోయి నాకు వ్యాక్సిన్ వేయవద్దు..నేను శివయ్యకు అపచారం చేయలేను అంటూ నానా హడావిడి చేసింది.ఆ తరువాత ఆమె అమ్మవారు తన శరీరంపైకి వచ్చినట్లు నాటకం ఆడటం మొదలుపెట్టింది. ఆ కాసేపటిలోనే ఆమె చేసిన రచ్చకు ఏమీ చేయలని వైద్యబృందం చేష్టలుడికి రోడ్డుమీదే నిలబడిపోయింది. అలా ఆమెకు ఎంతగా నచ్చజెప్పినా ఏమాత్రం వినలేదామె. దీంతో వాళ్లు ఏమీ చేయలేక తలలు పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.

Read more : Villagers Attack On Vaccine Team : వ్యాక్సిన్ వేయటానికి వచ్చిన సిబ్బందిపై కర్రలతో గ్రామస్తులు దాడి

కాగా నథ్యూఢానా గ్రామంలోని ప్రజలకు వ్యాక్సిన్ వేయటానికి వైద్యబృందం నానా పాట్లు పడి ఆ గ్రామానికి చేరుకుంది. కొండలు గుట్టలు దాటుకుని కాలినడకను అక్కడకు చేరుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతుంటే కాలువలను..వాగులను దాటుకుని వైద్య బృందంతో ఎంతో శ్రమపడి నథ్యూడాని గ్రామానికి చేరుకుంది. 100 శాతం వ్యాక్సిన్ వేయాలనే ఉద్ధేశ్యంతో కానీ సదరు శివభక్తురాలు చేసిన హడావిడితో ఆమెకు వ్యాక్సిన్ ఇవ్వకుండానే వెళ్లాల్సి వచ్చినందుకు వైద్య బృందం అసంతృప్తిని వ్యక్తంచేసింది.