Corona Vaccination Fear : వ్యాక్సిన్ మాకొద్దు బాబోయ్ అంటూ…నదిలో దూకి పారిపోయిన గ్రామస్తులు

దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత కొనసాగుతోంది. టీకా దొరికితే చాలు అని ఓ పక్క అనుకుంటుంటే..మరో పక్క మాత్రం మాకు వ్యాక్సిన్ వద్దు బాబోయ్ అంటూ కొంతమంది వైద్య సిబ్బందినుంచి తప్పించుకుంటున్నారు. అలా ఓగ్రామంలో టీకాలు వేయించుకోవటం తప్పించుకునేందుకు గ్రామస్థులు ఏకంగా నదిలో దూకి పారిపోయిన ఘటన సంచలన రేపింది.

Corona Vaccination Fear : వ్యాక్సిన్ మాకొద్దు బాబోయ్ అంటూ…నదిలో దూకి పారిపోయిన గ్రామస్తులు

Corona Vaccine Fear

villagers covid-19 Vaccination Fear : కరోను ఖతం చేయటానికి వచ్చిన వ్యాక్సిన్ వచ్చి ఇంత కాలం గడుస్తున్నా జనాల్లో ఇంకా భయం పోలేదు. టీకా వేయించుకోటానికి భయపడుతున్నవారు చాలామందే ఉన్నారు. వ్యాక్సిన్ వేయించుకోండీ..కరోనా నుంచి రక్షణ పొందండి..ఎటువంటి సమస్యలు రావని ప్రభుత్వం..వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. టీకా వచ్చిన కొత్తలో చాలామంది వ్యాక్సిన్ వేయించుకోటానికి భయంతో ముందుకు రాలేదు. దీంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు..కొంతమంది వ్యాపారులు..వ్యాక్సిన్ పై పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వ్యాక్సిన్ వేయించుకంటే ఇవి ఫ్రీ అవి ఫ్రీ అని కూడా ప్రకటించారు.

ఈక్రమంలో ప్రజల్లో అవగాహన పెరిగి..ఆఫర్ల కోసం కాకపోయినా వ్యాక్సిన్ వేయించుకోటానికి ముందుకొస్తున్నారు. రెండు డోసులు వేయించుకుంటున్నారు. కానీ దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇంకా ఈ భయం పోలేదు. కరోనా టీకా వేయించుకుంటే ఏమైపోతుందననే భయంతో వైద్య సిబ్బంది వ్యాక్సిన్లు వేయటానికి వచ్చినా ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. పైగా ‘‘మాకు టీకా వద్దు బాబోయ్..మీకు మీ టీకాకు ఓ దణ్ణం’’ అంటూ పారిపోతున్నారు. ఇటువంటి ఘటనే జరిగింది యూపీలోని ఓ గ్రామంలో. టీకా వేయటానికి వైద్య సిబ్బంది వచ్చారని తెలిసిన గ్రామస్తులు ఏకంగా నదిలో దూకి పారిపోయిన ఘటన జరిగింది బారాబంకీ గ్రామంలో.

కరోనా టీకా గురించి అవగాహన పెరిగిన క్రమంలో దేశంలో ఒకవైపు టీకాల కోసం జనం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.మరో వైపు వ్యాక్సిన్ వేయటానికి గ్రామానికి అధికారుల బృందం వచ్చారని తెలిసి యూపీలోని బారాబంకీ గ్రామస్తులు ఏకంగా అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయారు. బారాబంకీ గ్రామవాసులకు కొవిడ్ టీకాలు వేయడానికి ఆరోగ్యశాఖ అధికారుల బృందం గత శనివారం (మే 22,2021) గ్రామానికి చేరుకుంది. అంతే..ఈ విషయం తెలిసిన గ్రామస్తులు కొవిడ్ టీకాల నుంచి తప్పించుకోవడానికి ఆ ఊరి ఒడ్డున ఉన్న సరయూ నదిలోకి దూకి ఈత కొడుతూ తప్పించుకొని పారిపోయారు.

ఈ విచిత్ర సంఘటన గురించి తెలిసిన రామ్ నగర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాజీవ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. బరాబంకీ గ్రామస్తులకు కోవిడ్ టీకా గురించి అవగాహన కల్పించేదుకు యత్నించారు. కరోనా టీకా వేయించుకుంటే ఏమవుతుందోననే భయాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. కానీ చాలామంది గ్రామస్తులకు అదేమీ పట్టలేదు. బుర్రకు ఎక్కలేదు. భయం పోలేదు. దీంతో టీకా నుంచి తప్పించుకోవటానికి చాలామంది సరయూ నదిలో దూకి పారిపోయారు. కేవలం 14 మంది మాత్రమే టీకాలు వేయించుకున్నారు. దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ కొరత కొనసాగుతున్న క్రమంలో టీకా దొరికితే చాలురా బాబూ అని గంటల తరబడి లైన్లలో నిలబడి జనాలు ఎదుర్కొంటున్న తరుణంలో బారాబంకీ గ్రామస్థులు మాత్రం కరోనా టీకా అంటే అదేదో విషం అని భయపడి..టీకాలు వద్దని పారిపోవడం సంచలనం రేపింది.