Omicron World : ప్రపంచంపై ఒమిక్రాన్ పంజా..ఆస్ట్రేలియాలో తొలి మరణం!

కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ఆస్ట్రేలియా కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది. లాక్‌డౌన్‌ల విధింపు, ఎత్తివేత నిరంతరాయంగా కొనసాగాయి...

Omicron World : ప్రపంచంపై ఒమిక్రాన్ పంజా..ఆస్ట్రేలియాలో తొలి మరణం!

Omicron (5)

Australia Records First Omicron Death : ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభిస్తోంది. మరణాల సంఖ్యా పెరుగుతోంది. మొదటి నుంచీ కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ఆస్ట్రేలియాలోనూ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. అంతేకాదు.. ఆ దేశంలో తొలికరోనా మరణం నమోదయింది. ఒమిక్రాన్ బారిన పడిన 80 ఏళ్ల వృద్ధుడు.. సిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన ఆ వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు.. ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో వేరియంట్ మరణాలు నాలుగు దేశాల్లో నమోదయినట్టయింది. తొలి ఒమిక్రాన్ మరణం బ్రిటన్‌లో నమోదు కాగా, అమెరికా, ఇజ్రాయిల్‌లోనూ ఒమిక్రాన్‌తో రోగులు మరణించారు.

Read More : AP CM Jagan : ఏపీలో ఒమిక్రాన్..న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ? నైట్ కర్ఫ్యూ ?

కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ఆస్ట్రేలియా కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది. లాక్‌డౌన్‌ల విధింపు, ఎత్తివేత నిరంతరాయంగా కొనసాగాయి. దీనిపై దేశ ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు సైతం వ్యక్తమయ్యాయి. లాక్‌డౌన్‌ల ఎత్తివేత కోసం వీధుల్లోకొచ్చి పోరాటాలు చేశారు ఆస్ట్రేలియన్ ప్రజలు. దీంతో.. రెండేళ్ల తర్వాత ఇటీవలే కాస్త ఆంక్షలు సడలించింది. ఇతర దేశాల నుంచి వచ్చే ఆస్ట్రేలియన్లను క్వారెంటెయిన్‌తో పనిలేకుండా దేశంలోకి అనుమతించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినప్పటికీ.. కొత్త ఆంక్షల అమలుకు ఆ దేశం మొగ్గచూపడం లేదు. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని అధికారులు చెప్పారు.

Read More : Road Accident : రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి-అనాధలవటంతో అంత్యక్రియలు జరిపించిన ఎమ్మెల్యే

మరోవైపు భారతదేశంలో కూడా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో కోవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొన్నటి వరకు 17 రాష్ట్రాలకే పరిమితమైన వైరస్‌ తాజాగా మరో రెండు రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టింది. దీంతో ఒమిక్రాన్‌ బాధిత రాష్ట్రాల సంఖ్య 19కి చేరాయి. రోజుకు పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 578 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.