Ashok Gehlot on Nirbhaya Act: నిర్భయ చట్టం తర్వాత హత్యలు పెరిగాయి: రాజస్తాన్ సీఎం షాకింగ్ కామెంట్స్
అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఉరిశిక్ష లాంటివి అమలు చేస్తే అత్యాచారం అనంతరం సాక్ష్యాలు దొరక్కుండా లేదంటే బాధితురాలు ఫిర్యాదు వరకు వెళ్లకుండా హత్యలు చేసే ప్రమాదం ఉందనే వాదనలు బలంగానే వినిపించాయి. గెహ్లోత్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అత్యాచారం తర్వాత హత్యలు గతంలో ఇంత పెద్ద స్థాయిలో ఉండేవి కాదని, అయితే నిర్భయ చట్టం ద్వారా ఉరిశిక్ష అమలు చేస్తుండడంతో నిందితులు చట్టానికి దొరకకుండా ఉండేందుకు హత్యలు సైతం చేస్తున్నారని ఆయన అన్నారు

More Murders After Rape Following Law To Hang Accused Says Ashok Gehlot
Ashok Gehlot on Nirbhaya Act: దేశంలో నిర్భయ చట్టం తర్వాత అత్యాచారం అనంతరం హత్యలు పెరిగాయని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రమాదకరమైన ట్రెండ్ నడుస్తోందని, దీన్ని అడ్డుకోవాలని ఆయన అన్నారు. నీతి అయోగ్ సమావేశం నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ఆయన ఈ సమావేశానికి ముందు కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గెహ్లోత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తీవ్రంగా మండిపడ్డారు. గెహ్లోత్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. గడిచిన 3 ఏళ్లలో (గెహ్లోత్ ముఖ్యమంత్రి అయి నాలుగేళ్లు) రాజస్తాన్ రాష్ట్రంలో అమాయక బాలికలపై దాడులు పెద్ద ఎత్తున పెరిగాయని, ఆ విషయాన్ని దాచి పెట్టేందుకు వేరే అంశాన్ని లేవనెత్తి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి దుయ్యబట్టారు.
NITI Aayog meeting: నిధులు, మినహాయింపులు కావాలి: నీతి అయోగ్ సమావేశంలో సీఎంలు
అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఉరిశిక్ష లాంటివి అమలు చేస్తే అత్యాచారం అనంతరం సాక్ష్యాలు దొరక్కుండా లేదంటే బాధితురాలు ఫిర్యాదు వరకు వెళ్లకుండా హత్యలు చేసే ప్రమాదం ఉందనే వాదనలు బలంగానే వినిపించాయి. గెహ్లోత్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అత్యాచారం తర్వాత హత్యలు గతంలో ఇంత పెద్ద స్థాయిలో ఉండేవి కాదని, అయితే నిర్భయ చట్టం ద్వారా ఉరిశిక్ష అమలు చేస్తుండడంతో నిందితులు చట్టానికి దొరకకుండా ఉండేందుకు హత్యలు సైతం చేస్తున్నారని ఆయన అన్నారు. నిర్భయ కేసులో నిందితుల ఉరితీత అనంతరం ఈ సంఖ్య పెరిగినట్లు గెహ్లోత్ పేర్కొన్నారు.
వాస్తవానికి నిర్భయ చట్టాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం తీసుకువచ్చింది. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. దీంతో అప్పటి మన్మోహన్ ప్రభుత్వం 2013 మార్చి 19న నిర్భయ పేరుతో చట్టం చేసింది. 1973 నాటి లైంగిక వేధింపుల కేసుకు అనుగుణంగా దీనిని రూపొందించినట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కాగా, కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఈ చట్టంపైనే కాంగ్రెస్ నేత ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
Advocate Murder Case : న్యాయవాది హత్యకేసులో 10 మంది అరెస్ట్