Venkaiah Naidu: అరెస్ట్ నుంచి తప్పించుకునే అధికారం ఎంపీలకు లేదు
తిరిగి సభ సమావేశం కాగానే వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమకు విశేషాధికారాలు ఉన్నాయని ఎంపీలలో ఒక అపోహ ఉందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలకు కొన్ని విశేషాధికారులు ఉన్నాయని, తద్వారా ఎలాంటి అవరోధాలు లేకుండా వారు తమ విధులను నిర్వర్తించడానికి వీలుంటుందని చెప్పారు.

MPs do not enjoy immunity from arrest in criminal cases during Parliament session says Venkaiah Naidu
Venkaiah Naidu: పార్లమెంట్ సమావేశాలను సాకుగా చూపించి క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ నుంచి తప్పించుకునే విశేషాధికారాలు పార్లమెంట్ సభ్యులకు లేవని రాజస్యభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేకు ఈడీ మంగళవారం సమన్లు పంపడాన్ని నిరసిస్తూ దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగపరుస్తోందంటూ కాంగ్రెస్ సభ్యులు శుక్రవారంనాడు రాజ్యసభలో ఆందోళనకు దిగడంతో రాజ్యసభ నిమిషాల్లోనే వాయిదా పడింది. చాలా సేపు సభాకార్యక్రమాలు కొనసాగలేదు.
తిరిగి సభ సమావేశం కాగానే వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమకు విశేషాధికారాలు ఉన్నాయని ఎంపీలలో ఒక అపోహ ఉందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలకు కొన్ని విశేషాధికారులు ఉన్నాయని, తద్వారా ఎలాంటి అవరోధాలు లేకుండా వారు తమ విధులను నిర్వర్తించడానికి వీలుంటుందని చెప్పారు.
సివిల్ కేసుల్లో ఇలాంటి విశేషాధికారం ఉన్నప్పటికీ క్రిమినల్ మేటర్స్‌లో సామాన్య ప్రజానీకానికి, ఎంపీలకు మధ్య తేడా ఉండదని ఆయన చెప్పారు. ఆ ప్రకారం సెషన్ల సమయంలో క్రిమిషనల్ కేసుల విషయంలో అరెస్టు కాకుండా తప్పించుకునే విశేషాధికారాలు ఎంపీలకు లేవనని వెంకయ్యనాయుడు స్పష్టత ఇచ్చారు. ఇందుకు సంబంధించిన సుప్రీంకోర్టు రూలింగ్‌ను కూడా ఆయన ప్రస్తావించారు. తమ మందు హాజరు కావాలని దర్యాప్తు సంస్థలు ఆదేశిస్తే సభాకార్యక్రమాలున్నాయనే సాకు చూపించి హాజరును తప్పించుకునే వీలు ఎంపీలకు ఉండదని అన్నారు.