Tiger Shroff – Disha Patani : టైగర్ ష్రాఫ్ – దిశా పటానిపై ఎఫ్ఐఆర్ నమోదు..

బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్ - దిశా పటానిపై ముంబై పోలీసులు కేసు ఫైల్ చేశారు..

Tiger Shroff – Disha Patani : టైగర్ ష్రాఫ్ – దిశా పటానిపై ఎఫ్ఐఆర్ నమోదు..

Tiger Shroff Disha Patani

Updated On : June 3, 2021 / 4:36 PM IST

Tiger Shroff – Disha Patani: బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్ – దిశా పటానిపై ముంబై పోలీసులు కేసు ఫైల్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల వీరిద్దరూ కలిసి రాత్రి పూట ముంబై బాంద్రా వీధుల్లో కార్‌లో సరదాగా షికారు కొడుతూ పోలీసులకు చిక్కారు.

ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ ప్రేమ పక్షులు కనిపించారు. టైగర్ బ్యాక్ సీట్లో కూర్చోగా, దిశా పటాని ఫ్రంట్ సీట్లో కూర్చుని ఉంది.

ముంబై మీడియా సమాచారం ప్రకారం.. జిమ్ నుంచి బయటకు వచ్చిన ఈ లవ్ జంట చల్లగాలిని ఆస్వాదిస్తూ డ్రైవ్‌ ఎంజాయ్ చేద్దామని వెళ్లగా, ముంబై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ వీరిని ఆపారు. సరైన కారణం లేకుండా బయటకు రావడం అంటే లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించడమేనంటూ 188, 34 సెక్షన్ల కింద పోలీసులు వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారట.