Mumbai Police : స్పైడర్ మ్యాన్ మూవీ క్లిప్ వాడిన ముంబయి పోలీసులు .. పైరేటెడ్ సినిమాలు డౌన్ లోడ్ చేయడం నేరం కాదా? అని ప్రశ్నిస్తున్న నెటిజన్లు
ముంబయి పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎక్కువగా సినిమాలకు సంబంధించిన క్లిప్పులను వాడుతుంటారు. అదే వారిని ఇప్పుడు విమర్శలకు గురిచేస్తోంది. పైరేటెడ్ సినిమాలను డౌన్ లోడ్ చేయడం తప్పు అని చెప్పే పోలీసులు సినిమాల్లోని క్లిప్పులు ఎలా వాడుతున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Mumbai Police
Mumbai Police : రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించడంలో భాగంగా ముంబయి పోలీసులు స్పైడర్ మ్యాన్ మూవీ క్లిప్‌ని వాడారు. అది వైరల్ అవుతోంది. అయితే పోలీసులు విమర్శలు కూడా ఎదుర్కుంటున్నారు. తాజాగా ‘ స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్’ నుండి క్లిప్‌ను ఉపయోగించి మోటారు వాహనాలపై ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణించాలని సూచిస్తూ ఓ వీడియోను ముంబయి పోలీసులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో mumbaipolice పోస్టు చేశారు.
Mumbai police band : ముంబయి పోలీస్ బ్యాండ్ మామూలు పాట వాయించలేదుగా !!
భారతదేశంలో కేవలం ఇద్దరి కోసం తయారు చేయబడిన మోటారు వాహనంపై ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ వీడియోలో మార్వెల్ కామిక్స్ విలన్ నలుగురు సభ్యులు ఒకే బైక్‌లో ప్రయాణిస్తున్నట్లు కనిపించే వారితో మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ప్రయాణికులను ఉద్దేశించి ‘ఇది చాలా ప్రమాదకరం’ అని కూడా చెబుతుంది.
dancing cop : హీరోల్ని మించి స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్ వీడియో వైరల్
ఈ క్లిప్‌ను ముంబయి పోలీసులు ‘మీరు ఎంతమంది ఉన్నా భద్రతా నియమాలను మాత్రం ఉల్లంఘించవద్దు’ అనే శీర్షికతో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అవుతున్నప్పటికీ సినిమా క్లిప్‌ను పైరేటెడ్ మార్గాల ద్వారా పోలీసులు ఉపయోగిస్తున్నారంటూ వారిపై విమర్శలు వస్తున్నాయి. ‘పైరేటెడ్ సినిమాలను డౌన్ లోడ్ చేయడం నేరమని చెప్పే మీరు ఇలా నేరం చేయవచ్చునా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి వీరి ప్రశ్నలకు ముంబయి పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో? వేచి చూడాలి.
View this post on Instagram