Munugode By-Poll : ‘ఒట్టేసి చెబుతున్నా..మునుగోడు దాటిపోలేదు..పోనుకూడా’ : కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి కీలక వ్యాఖ్యలు

‘ఒట్టేసి చెబుతున్నా..మునుగోడు దాటిపోలేదు.. పోనుకూడా..ఆడబిడ్డ అంటే అంత అలుసా? ఇష్టానురీతిగా ఆరోపణలు చస్తారా?’ అంటూ మునుగోడు ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి కీలక వ్యాఖ్యలు చేశారు.

Munugode By-Poll : ‘ఒట్టేసి చెబుతున్నా..మునుగోడు దాటిపోలేదు..పోనుకూడా’ : కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి కీలక వ్యాఖ్యలు

Sensational comments of Congress candidate Palvai Sravanti

Updated On : November 3, 2022 / 11:57 AM IST

Munugode By- P oll : మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. చండూరు మండలం ఇడికుడలో 173లో పోలింగ్ కేంద్రంలో క్యూలైన్‌లో నిల్చోని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఓపార్టీకి చెందిన నేతతో తాను సమావేశమయ్యాయని వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తీవ్రంగా ఖండించారు. ఒట్టేసి చెబుతున్నాను..నేను మునుగోడు నియోజకవర్గాన్ని దాటి వెళ్లలేదు..వెళ్లను కూడా అంటూ తాను ఏపార్టీ నేతతోను సమావేశం కాలేదని స్పష్టంచేశారు. దేవుడిపై ఒట్టేసి చెబుతున్నా..నేను ఎవ్వరితోను సమావేశంకాలేదు…ఆడబిడ్డ అంటే అంత అలుసా? ఇష్టానురీతిగా ఆరోపణలు చేస్తారా? అంటూ స్రవంతి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ మహిళా అభ్యర్థిని ఓడించటానికి ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. దమ్ముంటే ఎన్నికల బరిలో పోరాడాలని తనపై దుష్ప్రాచారం చేస్తున్నవారిపై మండిపడ్డారు. ఓటమి భయంతోనే చుక్కా ముక్కా రాజకీయాలు చేసే నేతలకు..పార్టీలకు తనను విమర్శించే హక్కు..ఆరోపణలు చేసే హక్కులేదన్నారు.

నా ఓటుహక్కును వినియోగించుకున్నానని..ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తోందని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తాననే నమ్మకం తనకు ఉందన్నారు స్రవంతి. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ పార్టీల నేతలు ఎన్నికలను ఇబ్బందికరంగా మార్చటానికి రకరకాల రాజకీయాలు చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి మంచికాదన్నారు స్రవంతి.