Netflix Subscription Plan : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన యాడ్ సపోర్టెడ్ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Netflix Subscription Plan : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) యూజర్లకు గుడ్ న్యూస్.. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఎప్పటినుంచో నెట్‌ఫ్లిక్స్ చౌకైన ప్లాన్లను తీసుకొస్తుందంటూ అనేక ఊహాగానాలు వినిపించాయి.

Netflix finally launches its cheaper, ad-supported subscription plan Here is how much it costs
Netflix Subscription Plan : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) యూజర్లకు గుడ్ న్యూస్.. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఎప్పటినుంచో నెట్‌ఫ్లిక్స్ చౌకైన ప్లాన్లను తీసుకొస్తుందంటూ అనేక ఊహాగానాలు వినిపించాయి. నెట్‌ఫ్లిక్స్ ఎట్టకేలకు యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను రూపొందించింది.
బేసిక్స్ విత్ అడ్వర్ట్స్ అని పిలిచే ఈ ప్లాన్ ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, స్పెయిన్, యూకే, అమెరికాలో అందుబాటులో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే చౌక మొబైల్ మాత్రమే నెలవారీ ప్లాన్‌ను నెలకు కేవలం రూ. 179కి విక్రయించనుంది. నెట్‌ఫ్లిక్స్ అందించే చౌకైన ప్లాన్ భారత మార్కెట్లో అందుబాటులో లేదు.

Netflix finally launches its cheaper, ad-supported subscription plan
నెట్‌ఫ్లిక్స్ కొత్త బేసిక్స్ విత్ అడ్వర్ట్స్ ప్లాన్‌ను చేర్చడంతో ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌లపై పెద్దగా ఎఫెక్ట్ ఉండదనే గతంలోనే నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ విత్ అడ్వర్ట్స్ ప్లాన్ విస్తృత శ్రేణి గొప్ప టీవీ సిరీస్, ఫిల్మ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. పర్సనలైజడ్ వ్యూ ఎక్స్ పీరియన్స్, టీవీ, మొబైల్ డివైజ్ వైడ్ రేంజ్‌లో అందుబాటులో ఉంటుంది.
బేసిక్ విత్ అడ్వర్ట్ ప్లాన్ కోసం వీడియో క్వాలిటీ 720p/HDని అందిస్తుంది. మీరు గంటకు సగటున 4 నుంచి 5 నిమిషాల యాడ్స్ ఎన్ని యాడ్స్ చూస్తారో తెలుసుకోవచ్చు. లైసెన్సింగ్ లిమిట్స్ కారణంగా బేసిక్ విత్ అడ్వర్ట్ సబ్‌స్క్రైబర్‌లకు పరిమిత సంఖ్యలో మూవీలు టీవీ సిరీస్‌లకు కూడా యాక్సెస్ ఉండదుని చెప్పవచ్చు. నెట్ ఫ్లిక్స్ క్యాప్షన్లను డౌన్‌లోడ్ చేయలేరని గమనించాలి.
బేసిక్ విత్ అడ్వర్ట్స్ ప్లాన్ ప్రస్తుతం అన్ని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లకు పోలి ఉంటుంది. అయినప్పటికీ యూజర్లకు తక్కువ ధరలో ఉంటుంది. ఈ ప్లాన్ యూజర్లకు మధ్యలో కొన్ని యాడ్స్ మాత్రమే అంతరాయం కలిగించగలవు. కొత్త ప్లాన్‌కు మెంబర్‌షిప్ పొందడానికి మీరు Netflix.comని విజిట్ చేయవచ్చు. మీ ఈ-మెయిల్, పుట్టిన తేదీ, జెండర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.

Netflix finally launches its cheaper, ad-supported subscription plan
నెట్‌ఫ్లిక్స్ యాడ్స్‌తో కూడిన ప్లాన్ కూడా ప్రకటనదారులకు భారీ ప్లస్ అని చెప్పవచ్చు. బేసిక్ విత్ అడ్వర్ట్స్ కూడా ప్రకటనదారులకు ఒక మంచి అవకాశాన్ని సూచిస్తుంది. హై రిజల్యూషన్ యాడ్స్ ఎక్స్‌పీరియన్స్ ప్రీమియంతో లీనియర్ టీవీని చూడని ఇతర ప్రేక్షకులను చేరుకునేందుకు అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్ యాడ్స్ నిడివి 15 లేదా 30 సెకన్లు ఉంటుందని, సిరీస్, మూవీలకు వీక్షించే ముందు మధ్యలో ప్లే అవుతుందని కంపెనీ తెలిపింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..