WhatsApp Features: వాట్సప్‌లో అందుబాటులోకి కొత్త సదుపాయాలు.. ఒకేసారి 32 మందితో వీడియోకాల్ ..
వాట్సాప్ గ్రూప్‌లో ప్రస్తుతం 512 మంది పరిమితం. ఇకనుంచి గ్రూపులో 1024 మందిని సభ్యులుగా చేర్చుకునేందుకు వీలుంటుందని కంపెనీ ప్రకటించింది. కమ్యూనిటీల్లో సభ్యులను 5వేల మందికి పెంచుకోవచ్చు. మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ ద్వారా ఈ వివరాలు వెల్లడించారు.

WhatsApp Features
WhatsApp Features: స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతీఒక్కరూ వాట్సప్‌ను వినియోగిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే వాట్సప్ గ్రూప్‌లో సభ్యుల సామర్థ్యాన్ని పెంచుతూ సంస్థ అప్‌డేట్ చేసింది. వాట్సప్ తన వినియోగదారులకు కొత్తగా మరికొన్ని సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. ఇకనుంచి ఓ వినియోగదారుడు వాయిస్, వీడియోకాల్స్ ఒకేసారి 32మందితో అనుసంధానం కావచ్చు. అంతేకాదు 2జీబీ సామర్థ్యం కలిగిన ఫైళ్లనుకూడా పంపే వెసులుబాటు ఉంటుంది. గతంలో 16ఎంబీ ఫైళ్లను మాత్రమే పంపించుకొనే వెసులుబాటు ఉండేది.
WhatsApp Users : వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. View Once మెసేజ్‌లు ఇక పంపలేరు..!
వాట్సాప్ గ్రూప్‌లో ప్రస్తుతం 512 మంది పరిమితం. ఇకనుంచి గ్రూపులో 1024 మందిని సభ్యులుగా చేర్చుకునేందుకు వీలుంటుందని కంపెనీ ప్రకటించింది. కమ్యూనిటీల్లో సభ్యులను 5వేల మందికి పెంచుకోవచ్చు. మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ ద్వారా ఈ వివరాలు వెల్లడించారు. కమ్యూనిటీల్లో సభ్యులను 5వేల మందికి పెంచుకోవచ్చు. వాట్సప్ పై కమ్యూనిటీస్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
గ్రూపులు తిరిగి సబ్ గ్రూపులను, మల్టీఫుల్ థ్రెడ్స్, ఎనౌన్స్ మెంట్ ఛానళ్లు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. చాట్ ఫోల్స్ నిర్వహించుకోవచ్చునని, ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ కారణంగా ఇవి పూర్తిగా సురక్షితంగానూ, ప్రైవేటుగా ఉంటాయని మార్క్ జుకర్ తెలిపారు.