మడతబెట్టే ఫోన్ కావాలా? ఈ కొత్త స్లైడింగ్ ఫోన్.. 3 స్ర్కీన్ సైజుల్లో వస్తోంది!
new sliding phone unfolds into 3 screen sizes : మడతబెట్టే స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన మడతబెట్టే ఫోన్ల కంటే అత్యాధునిక టెక్నాలజీతో కొత్త స్లైడింగ్ ఫోన్ ఒకటి రాబోతోంది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి ఈ కొత్త స్లైడింగ్ ఫోన్ వస్తోంది.
ఇటీవలే X2021 రోలబుల్ ఫోన్ లను ఆవిష్కరించిన ఒప్పో.. ఇప్పుడు కొత్త స్లైడింగ్ ఫోన్లను మూడు రకాల స్ర్కీన్ సైజుల్లో ప్రవేశపెడుతోంది. ఈ కొత్త స్లైడింగ్ ఫోన్ మోడల్ ను ఒప్పో.. జపాన్ డిజైన్ స్టూడియో Nendo భాగస్వామ్యంతో ప్రవేశపెడుతోంది.

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో పెద్ద స్ర్కీన్ సైజు స్మార్ట్ ఫోన్లను గంటల కొద్ది చేతుల్లో పట్టుకోవడం ఇబ్బందికరంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒప్పో మూడు స్క్రీన్ సైజుల్లో మడతబెట్టే ఫోన్ తీసుకొస్తోంది. ఇప్పటివరకూ పెద్ద సైజు స్మార్ట్ ఫోన్లతో విసుగు చెందిన యూజర్లు ఈ మడతబెట్టే ఫోన్ కు మారిపోవచ్చు.
Today, we’re showcasing two new design concepts produced in collaboration with leading Japanese design studio, nendo.
First, is the ‘slide-phone’, which features a triple-hinge foldable screen system. #OPPOxnendo pic.twitter.com/r6YNrc2EmP
— OPPO (@oppo) December 14, 2020
ఈ కొత్త కాన్సెప్ట్ ఫోన్ నిలువుగా మడతబెట్టొచ్చు.. అప్పుడు అది చూడటానికి అచ్చం కొత్త Moto Razr, శాంసంగ్ గెలాక్సీ Z Flip వెర్షన్ ఫోన్ల మాదిరిగానే కనిపిస్తోంది. కానీ, ఈ స్లైడింగ్ ఫోన్ మోడల్ మాత్రం మూడు రకాల సైజుల్లో ఓపెన్ చేయొచ్చు.
– ఫస్ట్ స్ర్కీన్ ఓపెన్ చేస్తే.. క్లాక్, నోటిఫికేషన్లు కనిప్తాయి.
– సెకండ్ స్ర్కీన్ సిగ్మెంట్ లో.. సెల్ఫీ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు.
– మూడో సిగ్మెంట్ లో మొత్తానికి ఫుల్‌గా ఓపెన్ చేయొచ్చు.
– వైడ్ డిస్ ప్లేలో గేమింగ్, మూవీలు వాచ్ చేయొచ్చు లేదా ఏదైనా మల్టీ టాస్కింగ్ చేయొచ్చు.
– సైడ్ బటన్లు కూడా ఉన్నాయి. మీకు ఏ మోడ్ కావాలంటే అలా ఫంక్షనింగ్ మార్చుకోవచ్చు.
– ఇన్ బుల్ట్ స్టయిలీస్ ఫీచర్ కూడా.
మూడు స్ర్కీన్లలో మడతబెట్టే ఈ స్లైడింగ్ ఫోన్ మోడల్ డివైజ్ మార్కెట్లోకి ఎప్పుడైనా సేల్‌లో అందుబాటులోకి రావొచ్చు.. ఈ విషయంలో కంపెనీ ఒప్పో నుంచి ఎలాంటి స్పష్టత లేదు.
