AR Rahman: పెద్దితో ఫుల్ డిమాండ్.. రెహమాన్ కి వరుస ఆఫర్స్.. మెగాస్టార్ నుంచి రౌడీ హీరో దాకా!
తెలుగులో వరుస సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న ఏ ఆర్ రెహమాన్(AR Rahman).
ar rahman doing crazy movies in tollywood
- తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న రెహమాన్
- పెద్ది తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మ్యూజిక్
- విజయ్ దేవరకొండ సినిమాను కూడా ఒకే చేసిన రెహమాన్
AR Rahman: ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ, ఆయన ఎక్కువ తమిళ, హిందీ సినిమాలు చేయడానికి మాత్రమే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వారు. తెలుగులో ఆయన చాలా తక్కువ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు. చాలా గ్యాప్ తరువాత రెహమాన్ డైరెక్ట్ తెలుగులో మ్యూజిక్ చేస్తున్న సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, పెద్ది సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన చికిరి సాంగ్ కి ఎంత భారీ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈ పాట సన్సేషన్ క్రియేట్ చేసింది. పెద్ది టీజర్ కి రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఒక రేంజ్ లో ఉంది. దాంతో, ఇప్పుడు ఆయనతో వర్క్ చేసేందుకు చాలా మంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రెహమాన్(AR Rahman) అంటే కేవలం తమిళ్, హిందీ సినిమాలు మాత్రమే చేశాడు అనే టాక్ ని పెద్ది సినిమా చెరిపేసింది అనే చెప్పాలి.
Sahu Garapati: ఇండస్ట్రీ హిట్ తరువాత చిన్న సినిమా.. మెగా హీరోతో మాస్ ప్లానింగ్
పెద్ది తరువాత మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి సినిమాకు కూడా రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండ సినిమాను కూడా రెహమాన్ ఒకే చేసినట్టుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందించాలని రెహమాన్ ని కోరారట మేకర్స్. దానికి ఆయన కూడా ఒకే చెప్పినట్టుగా టాక్ నడుస్తోంది. ఇక పెద్ది తరువాత రామ్ చరణ్ తో మరో సినిమాకు వర్క్ చేయనున్నాడట రెహమాన్.
దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా శూతినః త్వరలోనే మొదలుకానుంది. అయితే, ఈ సినిమా కోసం కూడా రెహమాన్ ను తీసుకోవాలని చూస్తున్నారట మేకర్స్. ఇలా కేవలం పెద్ది అనే ఒక్క సినిమాతో ఇప్పుడు వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు రెహమాన్. మరి చాలా కాలం తరువాత రెహమాన్ తెలుగులో సినిమాలు చేయడం ఆసక్తికరంగా మారింది. మరి, ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉండబోతుందో అనేది చూడాలి.
