Sahu Garapati: ఇండస్ట్రీ హిట్ తరువాత చిన్న సినిమా.. మెగా హీరోతో మాస్ ప్లానింగ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో నెక్స్ట్ సినిమా చేస్తున్న నిర్మాత సాహు గారపాటి(Sahu Garapati).
Producer sahu garapati next movie with sai dharam tej
- మరో మెగా హీరోతో సాహు గారపాటి సినిమా
- ఇండస్ట్రీ హిట్ తరువాత మీడియం మూవీ
- దర్శకులుగా 2 మూవీ మేకర్స్
Sahu Garapati: ఒక సినిమా సక్సెస్ అయితే చాలు అనుకునే ఈరోజుల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే అది మాములు విషయం కాదు. కానీ, రీసెంట్ గా తాను చేసిన సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపించాడు టాలీవుడ్ నిర్మాత సాహు గారపాటి(Sahu Garapati). రీసెంట్ గా ఆయన బ్యానర్ నుంచి వచ్చిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి- దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది.
బాక్సాఫీస్ దగ్గర సినిమా ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే, ఈ సినిమా తరువాత నిర్మాత సాహు గారపాటి బ్యానర్ డిమాండ్ చాలా పెరిగిపోయింది. అందుకే, ఈ నిర్మాత నుంచి నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి, ప్రెజెంట్ ఈ నిర్మాత ఏ హీరోను అడిగినా డేట్స్ ఇచ్చేస్తారు. కానీ, సాహు గారపాటి మాత్రం మరో సారి మీడియం రేంజ్ హీరోతో సినిమా చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Jyoti Poorvaj: స్విమ్మింగ్ పూల్ లో సీరియల్ బ్యూటీ.. జ్యోతి పూర్వాజ్ హాట్ ఫొటోలు
ఆ హీరో మరెవరో కాదు మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఈ హీరో కోసం దర్శకద్వయం సందీప్- సుజీత్ లని సెట్ చేశాడట. ఈ దర్శకులు ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన క సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో థ్రిల్ చేసింది. రీసెంట్ గా ఈ దర్శకులు మరో సస్పెన్స్ కథను సాయి ధరమ్ తేజ్ కు వినిపించారట. దానికి, హీరో కూడా ఒకే చెప్పేశాడట. ఇక ఈ సూపర్ థ్రిల్లింగ్ ప్రాజెక్టును సాహు గారపాటి నిర్మిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మన శంకర్ వరప్రసాద్ గారు లాంటి ఇండస్ట్రీ చేసిన తరువాత నిర్మాత ఇలా చిన్న సినిమా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
కేవలం, కంటెంట్ పై ఉన్న నమ్మకంతోనే సాహు గారపాటి ఈ నిర్ణయం తీసుకున్నాడు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మన శంకర వరప్రసాద్ గారు తరువాత సాహు గారపాటి నుంచి అది కూడా మరో మెగా హీరోతో రాబోతున్న సినిమా కాబట్టి అంచనాలు చాలానే ఉంటాయి. అలోమోస్ట్ ఓకే అయిన ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటి గట్టు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
