T20 World Cup 2022: పాక్‌తో సెమీఫైనల్ మ్యాచ్.. ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో న్యూజిలాండ్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచులో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో తొలి సెమీఫైనల్ జరుగుతోంది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, ఆదిలోనే న్యూజిలాండ్ రెండు వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ (4 పరుగులు) షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే డివోన్ కాన్వే (21) షాదాబ్ ఖాన్ బౌలింగ్ వేస్తున్న సమయంలో రన్ ఔట్ అయ్యాడు.

T20 World Cup 2022: పాక్‌తో సెమీఫైనల్ మ్యాచ్.. ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో న్యూజిలాండ్

Updated On : November 9, 2022 / 2:17 PM IST

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచులో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో తొలి సెమీఫైనల్ జరుగుతోంది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, ఆదిలోనే న్యూజిలాండ్ రెండు వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ (4 పరుగులు) షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే డివోన్ కాన్వే (21) షాదాబ్ ఖాన్ బౌలింగ్ వేస్తున్న సమయంలో రన్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కానె విలియమ్సన్ 14, గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోరు 7 ఓవర్లకు 44-2 గా ఉంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది. రేపు సెమీఫైనలో ఇంగ్లండ్ తో టీమిండియా తలపడనుంది.

ఫైనల్ మ్యాచ్ ఈ నెల 13న జరగనుంది. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ విఫలం కావడంతో పాక్ గెలిచే అవకాశాలే అధికంగా కనపడుతున్నాయి. రేపటి మ్యాచులో ఇండియా గెలిస్తే ప్రేక్షకులకు ఫైనల్ లో మరింత మజా అందుతుంది. టీ20 ప్రపంచకప్ లో గ్రూప్ దశ మ్యాచుల్లో భారత్-పాక్ తలపడగా తీవ్ర ఉత్కంఠ మధ్య టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..