నిహారిక కొణిదెల ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. Niharika Konidela Chaitanya’s Pre-Wedding

Niharika Konidela-Chaitanya’s Pre-Wedding: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల వివాహం మరికొద్ది రోజుల్లో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో జరుగబోతోంది.
డిసెంబర్9, బుధవారం రాత్రి 7:15 నిమిషాలకు మిథున లగ్నంలో వీరి పెళ్లి జరుగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 11, శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌లో రిసెప్షన్ ప్లాన్ చేశారు.
తాజాగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి నిహారిక ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుస్మిత, శ్రీజ దంపతులు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహా, అల్లు శిరీష్, అల్లు వెంకటేష్ (బాబీ), సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు ఈ పార్టీలో పాల్గొని నిహారిక, చైతన్యలకు విషెస్ తెలియజేశారు.