NCP chief Sharad Pawar : మేనల్లుడి తిరుగుబాటుపై శరద్ పవార్ ఏమన్నారంటే …

స్వయానా తన మేనల్లుడైన అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ సోమవారం మొదటి సారి మీడియాతో మాట్లాడారు.....

NCP chief Sharad Pawar : మేనల్లుడి తిరుగుబాటుపై శరద్ పవార్ ఏమన్నారంటే …

NCP chief Sharad Pawar

Updated On : July 3, 2023 / 8:59 AM IST

NCP chief Sharad Pawar : స్వయానా తన మేనల్లుడైన అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ సోమవారం మొదటి సారి మీడియాతో మాట్లాడారు. ‘‘మా కుటుంబంలో ఎలాంటి సమస్య లేదు, మేం కుటుంబంలో రాజకీయాల గురించి చర్చించం. ప్రతి ఒక్కరూ వారి సొంత నిర్ణయం తీసుకుంటారు’’ అని శరద్ పవార్ చెప్పారు. (No Problem In Family) అజిత్ పవార్ మరో 8 మంది శాసనసభ్యులతో కలిసి తిరుగుబాటు చేసి యకత్వం వహించి, మరో 8 మంది పార్టీ నాయకులతో కలిసి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరారు. (Sharad Pawar After Nephews Mutiny)

NCP files disqualification petition : రెబెల్స్ అజిత్‌తోపాటు మరో 8 మందిపై ఎన్సీపీ అనర్హత పిటిషన్

శరద్ పవార్ సోమవారం సమరయోధుడు వైబి చవాన్ స్మారకాన్ని సందర్శించేందుకు సతారాకు బయలు దేరారు. తాను ఆదివారం అజిత్ పవార్ తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఎవరినీ సంప్రదించలేదని పవార్ చెప్పారు. కాగా స్వాతంత్ర్య సమరయోధుడు వైబీ చవాన్ కు శరద్ పవార్ నివాళులర్పిస్తారని, మహారాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే, ఎన్సీపీ మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ చెప్పారు. ‘‘అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత పార్టీ ఎదుర్కొంటున్నసమస్యలు, న్యాయపోరాటాలపై మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సమయంలో దీనిపై సమాచారం అతని వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుంది’’ అని శరద్ పవార్ చెప్పారు.

NCP working president Supriya Sule : రెబెల్స్ తిరిగి వస్తే సంతోషిస్తాం.. సుప్రియాసూలే వ్యాఖ్యలు

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్‌ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్న సమయంలో ఎన్సీపీలో తిరుగుబాటు వచ్చింది. తమ పార్టీలోని తిరుగుబాటు వల్ల ఉమ్మడి ప్రతిపక్షాల ముందున్న ప్రణాళికలను మార్చబోదని పవార్ స్పష్టం చేశారు. బెంగళూరులో జులై 16-18 తేదీల్లో జరగనున్న ప్రతిపక్షాల సమావేశంలో తాము కలిసి చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని శరద్ పవార్ చెప్పారు.

Ajit Pawar: ఎన్సీపీ మెజార్టీ సభ్యుల మద్దతు నాకే: అజిత్ పవార్

మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో హడావుడిగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అజిత్ పవార్, మరో 8 మంది ఎన్‌సిపి నాయకులు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుగుబాటుదారులతో శరద్ పవార్ చిరకాల సహాయకులు ఛుగన్ భుజ్‌బల్, ప్రఫుల్ పటేల్ వంటి ప్రముఖ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. కాగా మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్‌కు రాసిన లేఖలో తమకు 40 మందికి పైగా ఎన్‌సిపి ఎమ్మెల్యేలు, ఆరుగురు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు తనకు మద్దతు ఇస్తున్నారని అజిత్ పవార్ పేర్కొన్నారు. ఎన్సీపీలో తిరుగుబాటు నేపథ్యంలో బుధవారం ఆ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.