పవన్ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం..

పవన్ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం..

Updated On : February 12, 2021 / 10:03 PM IST

Pawan Kalyan: పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలకు, పలువురికి పలు విధాలుగా సాయమందించిన పవన్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ. 30 లక్షల భారీ విరాళమిచ్చిన సంగతి తెలిసిందే.

Ram Mandir

పవన్‌ని స్ఫూర్తిగా తీసుకుని అయిదుగురు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు రామ మందిర నిర్మాణానికి భారీ విరాళమందించారు. ఎ.ఎమ్. రత్నం, ఎస్.రాధా కృష్ణ (చినబాబు), దిల్ రాజు, నవీన్ ఎర్నేని, బండ్ల గణేష్ కలిసి అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ. 54.51 లక్షల విరాళమందించారు.

PK

పవన్ కళ్యాణ్‌ని స్ఫూర్తిగా తీసుకుని ఇంత మంచి కార్యక్రమంలో తాము కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని నిర్మాతలు తెలిపారు. ఈ మేరకు ఆర్.ఎస్.ఎస్. తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీ కి పవన్ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.