రాత్రి 9.30 గంటల వరకు వైన్ షాపులకు పర్మిషన్

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సందర్భంగా మొదటగా మద్యంషాపులను బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత లాక్ డౌన్ సడలింపులో భాగంగా తెలంగాణలో మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది. తాజాగా రాత్రి 9.30 గంటల వరకు మద్యం షాపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కిక్కు కోసం కిక్కిరిసిన క్యూ లైన్లు హైదరాబాద్‌లో వైన్స్ షాపుల ముందు దర్శనమిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్ ప్రకటిస్తుందని.. మందు బాబులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదట్లో లాక్‌డౌన్ విధించినప్పుడు మద్యం లేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఒకవేళ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధిస్తే.. ఇంట్లోనే చుక్కేసి కిక్కు తెచ్చుకోవాలని మందుబాబులు అనుకుంటున్నారు.
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో ముందే మద్యం కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవాలని మందుబాబులు వైన్ షాపుల ఎదుట క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల భౌతిక దూరం మరిచి మందు కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి.
వినియోగదారుల డిమాండ్ మేరకు ఎక్కువ మొత్తంలో స్టాక్ తెస్తున్నట్లు వైన్ షాపు నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని చోట్ల భౌతిక దూరం మరిచి మందు కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. వినియోగదారుల డిమాండ్ మేరకు ఎక్కువ మొత్తంలో స్టాక్ తెస్తున్నట్లు వైన్ షాపు నిర్వాహకులు చెబుతున్నారు.
Read:తెలంగాణలో 17 వేలు దాటిన కరోనా కేసులు…