Green Gram Cultivation : ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాలకు అనువైన పెసర.. అధిక దిగుబడల కోసం మేలైన యాజమాన్యం

ఖరీఫ్ లో ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాల్లోను, సెప్టెంబరు రెండవ పక్షం నుండి అక్టోబరులో రబీపంటలు సాగుచేసే రైతాంగం తొలకరిలో పెసరను  సాగుచేస్తున్నారు.. ప్రస్థుతం పైరు 20 నుండి 35 రోజుల దశ వరకు వుంది.

Green Gram Cultivation : ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాలకు అనువైన పెసర.. అధిక దిగుబడల కోసం మేలైన యాజమాన్యం

Green Gram Cultivation

Green Gram Cultivation : ఖరీఫ్ లో వర్షాధారంగా  విత్తిన పెసర పైరు ప్రస్థుతం 20 నుండి 30 రోజుల దశలో వుంది. రబీ పంటల వేయబోయే  రైతాంగం, 60 నుండి 75 రోజుల్లో చేతికొచ్చే పెసరను  తొలకరిలో సాగుచేయటం  ఆనవాయితీగా వస్తోంది. పెసర సాగు వల్ల తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం చేతికందటంతోపాటు , భూసారం పెరగుతోంది. అయితే చాలాప్రాంతాల్లోవర్షభావ  పరిస్థితులు, చీడపీడల బెడద పెసర పంటను  దెబ్బతీస్తున్నాయి  . వీటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Chandrababu Naidu : జగన్‌ని చిత్తుగా ఓడించే బాధ్యత మీది, మీ భవిష్యత్తు చూసుకునే బాధ్యత నాది- చంద్రబాబు నాయుడు

పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద 3కాలాల్లోను సాగుచేస్తున్నారు. ఖరీఫ్ లో ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాల్లోను, సెప్టెంబరు రెండవ పక్షం నుండి అక్టోబరులో రబీపంటలు సాగుచేసే రైతాంగం తొలకరిలో పెసరను  సాగుచేస్తున్నారు.. ప్రస్థుతం పైరు 20 నుండి 35 రోజుల దశ వరకు వుంది. చాలా ప్రాంతాల్లో బెట్ట పరిస్థితుల వల్ల పంట ఎదుగుదల  లోపించగా, కొన్ని ప్రాంతాల్లో కలుపు సమస్య ఎక్కువై పంట పెరుగుదల కు ఆటంకం ఏర్పడుతోంది.. ఈ సమస్యలను  అధిగమించేందుకు  చేపట్టాల్సిన  యాజమాన్యం గురించి ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్  డా. జె.హేమంత్ కూమార్ రైతాంగానికి  తెలియజేస్తున్నారు.

READ ALSO : Rajasthan: సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం.. మహిళలపై వేధింపులకు పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగం ఫట్

పెసర పైరు తొలిదశలో చిత్త పురుగులు, పల్లాకు తెగులు సమస్య అధికంగా కనిపిస్తోంది . పల్లాకు వైరస్ కు నివారణ లేదు. కనుక తెల్లదోమను  అరికట్టేందుకు  రైతులు తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.