Petrol Price Hike: సెంచరీ దాటినా ఆగని పెట్రో బాదుడు!
పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన ధరల పెరుగుదల ఇప్పటికీ పైపైకి వెళ్తూనే ఉంది. ఎన్నికల అనంతరం సామాన్యులకు ధరల వాతలు పెడుతున్న చమురు కంపెనీలు శనివారం మరోసారి ధరలు పెంచాయి. దీంతో చమురు ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరాయి.

Petrol Price Hike
Petrol Price Hike: పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన ధరల పెరుగుదల ఇప్పటికీ పైపైకి వెళ్తూనే ఉంది. ఎన్నికల అనంతరం సామాన్యులకు ధరల వాతలు పెడుతున్న చమురు కంపెనీలు శనివారం మరోసారి ధరలు పెంచాయి. దీంతో చమురు ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరాయి. నేడు (జూన్ 26) పెట్రోల్ పై 36 పైసలు, డీజిల్ పై 38 పైసలు ధర పెరిగింది.
శనివారం పెరిగిన ధరలతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 98.11 ఉండగా.. డీజిల్ రూ. 88.65గా ఉంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 104.22గా ఉండగా.. డీజిల్ ధర 96.16కు చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 99.19, డీజిల్ రూ. 93.23గా ఉండగా కోల్కత్తాలో లీటర్ పెట్రల్ ధర రూ. 97.97, డీజిల్ ధర రూ. 91.50కు చేరింది.
ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎప్పుడో సెంచరీ దాటిన పెట్రోల్ పరుగులు పెడుతూనే ఉంది. ఇక డీజిల్ కూడా సెంచరీకి సిద్దమవుతుంది. శనివారం హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు 36 పైసలు పెరిగి.. రూ.101.96 వద్ద ఉండగా డీజిల్ ధర 38 పైసలు పెరిగి రూ.96.63కి చేరింది. ఇక గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.104.31 ఉండగా.. డీజిల్ రూ.98.38 కు చేరింది. అదే వైజాగ్లో పెట్రోల్ ధర లీటర్ రూ.104.11 వద్ద ఉండగా.. లీటర్కు డీజిల్ ధర రూ.98.18గా ఉంది. ఇదేరకంగా పెరుగుతూ పోతే మరో వారం రోజులలో డీజిల్ కూడా సెంచరీ టచ్ చేయడం గ్యారంటీగా కనిపిస్తుంది.