PM Modi’s birthday : ప్రధాని మోడీ పుట్టిన రోజున జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలు బహుమతి

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పుట్టిన రోజున జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలు ఉంగరాలు గిఫ్టుగా ఇవ్వాలని నిర్ణయించారు బీజేపీ నేతలు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టిన‌రోజు. ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలను పంపిణీ చేస్తున్నారు.

PM Modi’s birthday : ప్రధాని మోడీ పుట్టిన రోజున జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలు బహుమతి

PM Modi's birthday: Tamilnadu BJP to gift gold rings to newborns

Updated On : September 17, 2022 / 11:48 AM IST

PM Modi’s birthday : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పుట్టిన రోజున జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలు ఉంగరాలు గిఫ్టుగా ఇవ్వాలని నిర్ణయించారు త‌మిళ‌నాడు బీజేపీ నేతలు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టిన‌రోజు. ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలను పంపిణీ చేస్తున్నారు. ఉంగరాలను పంపిణీ చేయడానికి ఆర్ఎస్ఆర్ఎం హాస్పిటల్‌ను ఎంచుకున్నామని బీజేపీ నేత ఎల్ మురుగన్‌కు తెలిపారు. ప్రతి బంగారు ఉంగరం రెండు గ్రాముల బరువు ఉన్న ఉంగరం రూ.5,000 ధర ఉంటుందని తెలిపారు. ఈ ఉంగరాలను ఈరోజు (సెప్టెంబర్ 17) పుట్టిన శిశువులకు పంపిణీ చేస్తున్నారు.

ఇది పార్టీ కోసం చేసే ఉచితాల స్కీం కాదని..శిశువులను స్వాగతించాలని బీజేపీ భావిస్తోందని అందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.అలాగే ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా 730 కిలోల చేపలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 2022 సంవత్సం పుట్టిన రోజుతో ప్రధాని మోడీ 73వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా 730 కిలోల చేపలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని మురుగన్ తెలిపారు. బీజేపీ నేతలు వినూత్నం ఈ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ నియోజకవర్గాన్ని ఎంచుకోవటం గమనించాల్సిన విషయం.