Bandi Sanjay Padayatra : పాదయాత్ర నిలిపివేయాలని బండి సంజయ్ కు పోలీసుల నోటీసులు
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాదయాత్ర నిలిపివేయాలని బండి సంజయ్ కు వరంగల్ కమిషనరేట్ నోటీసులు జారీ చేశారు.

Warangal Commissionerate issued notices to Bandi Sanjay
Warangal Commissionerate issued notices to Bandi Sanjay Padayatra : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాదయాత్ర నిలిపివేయాలని బండి సంజయ్ కు వరంగల్ కమిషనరేట్ నోటీసులు జారీ చేశారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రం మూడవ విడత కొనసాగుతోంది. పాదయాత్ర పొడవునా బండి తెలంగాణ ప్రభుత్వంమీద..సీఎం కేసీఆర్ పైనా విమర్శలు కురిపిస్తునే ఉన్నారు. బండి విమర్శలకు టీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఈక్రమంలో బండి సంజయ్ మరో అడుగు ముందుకే సీఎం కేసీఆర్ కుమార్తె..ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పాత్ర ఉందని ఆరోపించారు. ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు కూడా కవితపై ఆరోపణలుచేశారు. దీంతో కవిత నివాసం ముంద బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో బండి సంజయ్ పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలకు దీక్ష చేపట్టాలని పిలుపినివ్వటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకుని జనగామ నుంచి కరీంనగర్ కు తరలించి ఆయన ఇంటిలో వదిలివేశారు. అనంతరం బండి సంజయ్ తనను అన్యాయంగా పోలీసులు నిర్భంధించారని పాదయాత్రను నిలిపివేయటానికి ఇలా తనను అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసినా పాదయాత్రను కొనసాగిస్తానని స్పష్టంచేశారు.
ఈ సందర్భంగా తనకు తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని పాద్రయాత్రకు భద్రతగా కేంద్రం బలగాలు కావాలని కోరుతు కేంద్ర ప్రభుత్వానికి లేఖరాశారు. దీంతో బండి సంజయ్ పాదయాత్రను నిలివేయాలని ఆదేశిస్తూ వరంగల్ పోలీసులు బండి సంజయ్ కు నోటీసులు జారీచేశారు. కానీ బండి మాత్రం పాదయాత్రను తిరిగి కొనసాగిస్తానని స్పష్టం చేస్తున్న క్రమంలో ఏం జరుగుతుందో చూడాలి…కాగా బండి సంజయ్ అరెస్టుని బీజేపీ నేతలకు తీవ్రంగా ఖండిస్తున్నారు. అవినీతి గురించి ప్రశ్నిస్తే అరెస్ట్ లు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.