Singer Smita : బాలయ్య మంచి మనసు గురించి చెబుతూ ఎమోషనల్ అయిన సింగర్ స్మిత..
తెలుగు పాప్ సింగర్ కమ్ యాక్ట్రెస్ స్మిత బాలయ్య మంచి మనసును ప్రశంసిస్తూ ఓ వీడియో షేర్ చేశారు..

Pop Singer Smita About Nandamuri Balakrishna
Singer Smita: నటసింహ, హిందూపూర్ ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ.. జూన్ 10న తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు..
ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తెలుగు పాప్ సింగర్ కమ్ యాక్ట్రెస్ స్మిత బాలయ్య మంచి మనసును ప్రశంసిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఒక జర్నలిస్ట్ తన ఫ్రెండ్ మరో జర్నలిస్ట్ కొడుకు ట్రీట్‌మెంట్ కోసం హెల్ప్ అడగ్గా.. ఒక పర్సన్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేశానని.. పరిస్థితి ఆయనకు వివరించి, ఇన్ఫర్మేషన్ పాస్ చెయ్యగా..
కొద్ది సేపటి తర్వాత డాక్టర్స్ కాల్ చేసి హాస్పిటల్‌కి రమ్మన్నారని, బాబు ట్రీట్‌మెంట్ గురించి వర్రీ అవ్వొద్దని చెప్పారని.. ఆ వ్యక్తి బాలకృష్ణ అని.. నిండు నూరేళ్లు, హ్యాపీగా, హెల్దీగా ఆయనుండాలని కోరకుంటున్నానంటూ బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు సింగర్ స్మిత.
#HappyBirthdayNBK wishing you the best always. pic.twitter.com/XvBOIQsKFM
— Smita (@smitapop) June 10, 2021