Green India Challenge : హామీ ఇచ్చిన ప్రభాస్..ఎవరిని నామినేట్ చేశారో తెలుసా

Green India Challenge ని స్వీకరించారు నటుడు ప్రభాస్. మూడో దశలో భాగంగా మూడు మొక్కలను నాటారు. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు. పర్యావరణ హితం కోసం ఎంపీ సంతోష్ ‘Green India Challenge’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు..ప్రభాస్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
దీంతో 2020, జూన్ 11వ తేదీ గురువారం తన నివాసంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ప్రభాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎంపీ సంతోష్ కుమార్..ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉన్నత విలువలతో కూడినది..దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్యక్రమం తనను ఇన్ స్పైర్ చేసిందని చెప్పుకొచ్చారు.
వారు ఎక్కడ సూచిస్తే..వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా..రిజర్వ్ ఫారెస్టును దత్తత తీసుకుంటానని వెల్లడించారు. కార్యక్రమం కొనసాగింపుగా..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి రానా, శ్రద్ధా కపూర్ లకు ఛాలెంజ్ నామినేట్ చేస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆశయం తెలుసుకున్న వెంటనే మూడు మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్ ఫారెస్టు అభివృద్ధికి పూనుకోవడం స్పూర్తిదాయకమని, సమాజంతో బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడని ఎంపీ సంతోష్ వెల్లడించారు. ఆయన అభిమానులంతా ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి నేలతల్లికి పచ్చని పందిరి వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
#Prabhas accepts #GreenIndiaChallenge ??
Full video pic.twitter.com/rEr42C1lo9— Prabhas Army (@PrabhasFanArmy) June 11, 2020