Prashanth Neel : తండ్రి జ్ఞాపకార్థం సొంతూరు ఆసుపత్రికి భారీ విరాళం ప్రకటించిన ప్రశాంత్ నీల్

తాజాగా 75 స్వాతంత్య్ర దినోత్సవం, అలాగే తన తండ్రి 75వ జయంతి కావడంతో సొంత ఊరుకి వచ్చాడు ప్రశాంత్ నీల్. సొంతూరులో ఉన్న బంధువులను పలకరించాడు, అక్కడి ఆలయాన్ని కూడా...........

Prashanth Neel : తండ్రి జ్ఞాపకార్థం సొంతూరు ఆసుపత్రికి భారీ విరాళం ప్రకటించిన ప్రశాంత్ నీల్

Prashanth Neel

Updated On : August 16, 2022 / 9:07 AM IST

Prashanth Neel :  KGF సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఇక ప్రశాంత్ నీల్ తెలుగు వాడని అందరికి తెలిసిందే. ప్రశాంత్ నీల్ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురంకి చెందిన వ్యక్తి. తన తాత, తండ్రులు అంతా ఇక్కడే ఉండేవారు. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ప్రశాంత్ నీల్ కి బాబాయ్ అవుతారు. అప్పుడప్పుడు ప్రశాంత్ నీల్ తన సొంతూరికి వచ్చి వెళ్తూ ఉంటారు.

Indraja : పెద్ద బ్యానర్స్ అడిగినప్పుడు స్పెషల్ సాంగ్స్ ఒప్పుకోక తప్పదు.. ఇష్టం లేకుండానే ఆ పాటలు చేశాను..

ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి కొన్ని నెలల క్రితమే మరణించగా ఆయన సమాధిని ఇక్కడే నీలకంఠాపురంలో నిర్మించారు. తాజాగా 75 స్వాతంత్య్ర దినోత్సవం, అలాగే తన తండ్రి 75వ జయంతి కావడంతో సొంత ఊరుకి వచ్చాడు ప్రశాంత్ నీల్. సొంతూరులో ఉన్న బంధువులను పలకరించాడు, అక్కడి ఆలయాన్ని కూడా సందర్శించాడు. ఆ తర్వాత తన తండ్రి జ్ఞాపకార్థం నీలకంఠాపురంలో ఉన్న ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి విరాళంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించారు ప్రశాంత్ నీల్. దీంతో నీలకంఠాపురం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామ ప్రజలతో పాటు నెటిజన్లు, ప్రేక్షకులు కూడా ప్రశాంత్ నీల్ ని అభినందిస్తున్నారు.