Indraja : పెద్ద బ్యానర్స్ అడిగినప్పుడు స్పెషల్ సాంగ్స్ ఒప్పుకోక తప్పదు.. ఇష్టం లేకుండానే ఆ పాటలు చేశాను..

ఇంద్రజ కెరీర్ ఆరంభంలో నాగార్జున సరసన కన్నెపిట్టరో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసింది. అలాగే తమిళ్ లో ఒక ఐటెం సాంగ్ చేసింది. ఇంటర్వ్యూలో వాటి గురించి అడగగా.. ఇంద్రజ మాట్లాడుతూ............

Indraja : పెద్ద బ్యానర్స్ అడిగినప్పుడు స్పెషల్ సాంగ్స్ ఒప్పుకోక తప్పదు.. ఇష్టం లేకుండానే ఆ పాటలు చేశాను..
ad

Indraja :  ఇటీవల చాలా మంది హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయడానికి ఒప్పుకుంటున్నారు. స్టార్ హీరోయిన్స్ సైతం డబ్బులు ఎక్కువ ఆఫర్ చేస్తే ఐటెం సాంగ్స్ చేసేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఐటెం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ చేయడానికి సపరేట్ గా కొంతమంది డ్యాన్సర్లు ఉండేవాళ్ళు. హీరోయిన్స్ అంత తొందరగా స్పెషల్ సాంగ్స్ లో నటించడానికి ఒప్పుకునేవారు కాదు. ఒకప్పటి హీరోయిన్, సీనియర్ నటి ఇంద్రజ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడింది.

Uorfi Javed : రెండేళ్లుగా వేధిస్తున్నాడు.. పోలీసులకి చెప్పినా పట్టించుకోవడంలేదు.. సోషల్ మీడియాలో ఉర్ఫీ జావేద్ పోస్ట్

ఇంద్రజ కెరీర్ ఆరంభంలో నాగార్జున సరసన కన్నెపిట్టరో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసింది. అలాగే తమిళ్ లో ఒక ఐటెం సాంగ్ చేసింది. ఇంటర్వ్యూలో వాటి గురించి అడగగా.. ఇంద్రజ మాట్లాడుతూ.. ”అలాంటి సాంగ్స్ రిక్వెస్టుపైనే ఎక్కువగా చేస్తాం. పెద్ద బ్యానర్‌ అడిగినప్పుడు చేయకపోతే బాగుండదు. పెద్ద బ్యానర్ కదా అని ఒక్కోసారి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇష్టం లేకుండానే ఆ పాటలు చేశాను. వాటి గురించి ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా లేనిపోని వివాదాలు వస్తాయి. అందుకే వాటి గురించి ఎక్కువగా మాట్లాడను” అని తెలిపింది.