Urfi Javed : రెండేళ్లుగా వేధిస్తున్నాడు.. పోలీసులకి చెప్పినా పట్టించుకోవడంలేదు.. సోషల్ మీడియాలో ఉర్ఫీ జావేద్ పోస్ట్

ఓ వ్యక్తి ఫోటోని ఉర్ఫీ జావేద్‌ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ''ఇతను నన్ను రెండేళ్లుగా వేధిస్తున్నాడు. నా ఫొటోను మార్ఫింగ్ చేసి నాకు పంపించి తనతో న్యూడ్ వీడియో కాల్ చేయమని, తనతో.............

Urfi Javed : రెండేళ్లుగా వేధిస్తున్నాడు.. పోలీసులకి చెప్పినా పట్టించుకోవడంలేదు.. సోషల్ మీడియాలో ఉర్ఫీ జావేద్ పోస్ట్

Uorfi Javed :  బాలీవుడ్ లో తన డ్రెస్సింగ్ స్టైల్ తో బాగా ఫేమస్ అయింది మోడల్/ ఆర్టిస్ట్ ఉర్ఫీ జావేద్. ఇక బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. బాలీవుడ్ జనాలు ఉర్ఫీ ఎప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకొస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. తాజాగా ఉర్ఫీ జావేద్ తనని ఓ వ్యక్తి రెండేళ్ల నుంచి వేధిస్తున్నాడని, పోలీసులకి కంప్లైంట్ చేసినా పట్టించుకోవడంలేదంటూ అతని ఫోటోని షేర్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఓ వ్యక్తి ఫోటోని ఉర్ఫీ జావేద్‌ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ”ఇతను నన్ను రెండేళ్లుగా వేధిస్తున్నాడు. నా ఫొటోను మార్ఫింగ్ చేసి నాకు పంపించి తనతో న్యూడ్ వీడియో కాల్ చేయమని, తనతో సెక్స్ చేయమని బలవంతం చేస్తున్నాడు. నేను ఒప్పుకోకపోతే ఆ ఫేక్ ఫొటోను అనేక బాలీవుడ్‌ పేజీలలో పోస్ట్ చేసి నా కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడు. రెండేళ్లుగా ఇలా నరకం చూపిస్తున్నాడు.”

Famous Film Critic Kauhsik : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ, యువ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ హఠాన్మరణం

”నేను దీనిపై ముంబైలోని గుర్గావ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. కానీ వాళ్ళు ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతను పంజాబీ చిత్రసీమలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ముంబయి పోలీసుల గురించి మంచి విషయాలు విన్నాను. కానీ ఈ విషయంలో ఎందుకు వారి ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదో నాకు అర్ధం కావట్లేదు. అతని వల్ల సమాజానికి, ముఖ్యంగా మహిళలకు ప్రమాదం. ఇప్పటికైనా పోలీసులు అతనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాను” అని అతని ఫొటోలతో పాటు, అతను చేసిన వాట్సాప్ చాట్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ విషయం బాలీవుడ్ లో చర్చగా మారింది. నెటిజన్లు, అభిమానులు ఉర్ఫీకి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తూ పోలీసులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)