Famous Film Critic Kauhsik : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ, యువ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ హఠాన్మరణం

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, మూవీ ట్రాకర్ కౌశిక్ ఎల్‌ఎం హఠాన్మరణం చెందారు. కార్డియాక్ అరెస్ట్‌ తో కౌశిక్ కన్నుమూశారు.

Famous Film Critic Kauhsik : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ, యువ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ హఠాన్మరణం

Famous Film Critic Kauhsik : సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, మూవీ ట్రాకర్ కౌశిక్ ఎల్‌ఎం హఠాన్మరణం చెందారు. కార్డియాక్ అరెస్ట్‌ తో కౌశిక్ కన్నుమూశారు. కౌశిక్ వయసు 36ఏళ్లు.

యువ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ అర్థాంతరంగా తనువు చాలించడంతో సినీపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి క్రిటిక్స్, చిత్ర ప్రముఖులు కౌశిక్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

తన వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతా ద్వారా బాక్సాఫీస్ రిపోర్టులు, సినిమా అప్‌డేట్‌లను అందించడంలో కౌశిక్ పేరు పొందారు. ప్రత్యేకమైన సినిమా అప్‌డేట్‌లను పొందడానికి చాలా కాలంగా అతనిని అనుసరిస్తున్న ట్విట్టర్ వినియోగదారులకు కౌశిక్ ఇక లేడు అనే వార్త షాక్‌ కి గురి చేసింది. “సీతారామం” చిత్రానికి సంబంధించి 7 గంటల క్రితం కూడా అతను ఒక ట్వీట్‌ను అప్‌లోడ్ చేశాడు.

ఫిల్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాకర్, ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబ్ వీడియో జాకీ, ఫిల్మ్ రివ్యూయర్, క్రికెట్ & టెన్నిస్ బఫ్‌గా కౌశిక్ గుర్తింపు పొందారు. మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తోటి సినిమా ట్రాకర్లు, థియేటర్ యజమానులు, ప్రముఖులు మరియు సినీ సమీక్షకులు కౌశిక్ మృతికి సంతాపం తెలిపారు.

సినిమా ట్రాకింగ్‌తో పాటు, సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే వాడు కౌశిక్. అతని తెలివైన ప్రశ్నలకు, స్టార్లతో అతడు మాట్లాడే విధానం చాలామందికి నచ్చింది. దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ఫాలోవర్లు కలిగున్న గలాట్టా(Galatta) యూట్యూబ్ ఛానెల్ కోసం ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు కౌశిక్.

కౌశిక్ మరణాన్ని గలాట్టా యూట్యూబ్ ఛానెల్ ధృవీకరించింది. ఈ మేరకు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ ట్వీట్ చేసింది. “ప్రఖ్యాత సినీ విమర్శకుడు, మూవీ ట్రాకర్ మరియు గలాట్టా VJ @LMKMovieManiac గుండెపోటు కారణంగా ఈరోజు మరణించారు. ఆయన మరణం మాకు వ్యక్తిగతంగా తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అంటూ ట్వీట్ చేసింది.

కాగా, యుక్త వయసులోనే అకాల మరణాలు సంభవిస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మధ్య కాలంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు. నిరంతర వ్యాయాయం, ఆరోగ్యం అంటే శ్రద్ధ కలిగిన వారు, ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తున్న వారు కూడా గుండె పోటుకు గురికావడం కలవర పెడుతోంది.

 

గుండెపోటుతో ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ హఠాన్మరణం..