కలర్ ఫుల్ మాస్క్‌లతో రెడీ అవుతోన్న ట్రికినీలు

  • Published By: Subhan ,Published On : May 13, 2020 / 09:45 AM IST
కలర్ ఫుల్ మాస్క్‌లతో రెడీ అవుతోన్న ట్రికినీలు

Updated On : October 31, 2020 / 2:52 PM IST

గ్లామర్ ఆరబోతకు, సన్‌బాత్‌కు, సినిమాల్లో హాట్ హాట్ సాంగ్ లకూ బికినీలు కేరాఫ్ అడ్రస్. వయస్సుతో సంబంధం లేకుండా బికినీ సోకులు అంటే ఎవరైనా చెప్పేస్తారు. మరి ఈ ట్రికినీలు ఏంటో.. తెలుసా. అదేనండి మాస్క్ లు. బికినీతో పాటు మాస్క్ ఉంటే అది ట్రికినీ. కరోనా భయం ఎంత ముదిరిపోయిందంటే మాస్క్ లేకుండా బయటికి వెళ్తే కరోనా వచ్చేస్తుందేమో అనేంత. 

ఇక ఈ పరిస్థితుల్లో మాస్క్ లు సిద్ధం చేయకుండా ఉంటారా.. డ్రస్ కు మ్యాచ్ అయ్యే మాస్క్ లు రెడీ చేసుకుంటుంటే ఇటలీలో ఓ మోడల్ బికినీతో పాటు మ్యాచ్ అయ్యే మాస్క్ లు కట్టుకుని ఫోజులిస్తుంది. ఇలా ఉంటే కూల్/క్యూట్/ఫ్యాషన్ గా ఉంటామని చెప్పుకొస్తుంది. ఈ ఇటాలియన్ డిజైనర్ ఐడియా మన నేటివిటీకి మ్యాచ్ అవుతుందో లేదో గానీ, ఆమె ఐడియాపై ఓ లుక్కేద్దాం.

కరోనా సమయంలో బీచ్ లలో తిరగాలనే వారి కోసం సెంట్రల్ ఇటలీలోని ఎలెక్సా బీచ్ వేర్ యజమాని టిజియానా pandemic-proof(మహమ్మారి నుంచి కవచం)ను తయారుచేస్తుంది. కరోనా వైరస్ కారణంగా బయటకు వెళ్లకూడదని చెప్పడంతో ఆమె ఇంట్లో ఉండి ఈ వినూత్న ఐడియాతో రెడీ అయింది. 

ప్రపంచంలో కొద్ది చోట్ల నిబంధనలతో కూడిన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కరోనా మనతోనే ఉంటుంది. కలిసి బతకాల్సి వస్తుంది అంటున్నారు. అలాంటప్పుడు బీచ్ లలో ఎంజాయ్ చేయాలనుకునేవారు ఈ ట్రికినీలు వాడితే సరిపోతుందేమో.. సమ్మర్ కాబట్టి లాక్‌డౌన్ ఎత్తేస్తే తన ట్రికినీల ఐడియాతో మంచి గిరాకీ తెచ్చుకుంటానంటోంది ఈ డిజైనర్. 

పబ్లిసిటీ కోసం ఆమె వాటిని తయారుచేసి కూతుళ్లకు వేసింది. సోషల్ మీడియా పెట్టడంతో వైరల్ అయ్యాయి. అంతే ఆమె ట్రికినీలకు ఆర్డర్ల వెల్లువ మొదలైంది. లాక్ డౌన్ లో ఇంత బిజినెస్ జరుగుతుందని అనుకోలేదు. కలర్ మాస్క్ లు ఆర్డర్ ఇవ్వడంతో పాటు ట్రికినీలను సైతం తీసుకెళ్తున్నారు. ఇటలీలో ఇప్పటికే లాక్ డౌన్ తీసేశారు. 

Read Here>> Twitter ఉద్యోగులకు పర్మినెంట్‌గా Work from Home