జంతువుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే ఐదేళ్ల జైలు

Cruelty on Animals: కుక్కల నుంచి పిల్లుల వరకూ.. గుర్రాల నుంచి ఏనుగుల వరకూ.. జంతువుల పట్ల చిన్న చూపుకు ఏ మాత్రం హద్దులు కనిపించడం లేదు. కొన్ని చోట్లు జంతువుల ఆహారాల్లో పేలుడు బాంబులు పెట్టి చనిపోయేందుకు కారణం అవడం, మరోవైపు చిత్రహింసలు పెట్టి చంపేయడం లాంటివి వింటూనే ఉన్నాం. ఇదంతా త్వరలోనే మారనుంది.
రాజ్యసభలో శుక్రవారం ఈ అంశంపై పార్లమెంట్ క్వశ్చన్‌కు రాతపూర్వకమైన రెస్పాన్స్ వచ్చింది. మత్స్య, జంతు సంరక్షణ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ దీనిపై మాట్లాడుతూ.. ప్రభుత్వం గతంలో ఉన్న పీసీఏ చట్టం 1960ను అమెండింగ్ చేయాల్సి ఉంది.
మంగళవారం జంతు సంరక్షణ శాఖ మంత్రిత్వ శాఖ జంతువులపై హింసకు శిక్షగా రూ.50ల పెనాల్టీను పెంచాల్సిందిగా పేర్కొంది. కొట్టినా, తన్నినా, వేధించినా, ఆకలితో ఉంచినా, ఎక్కువ బరువులు వేసినా, స్వారీలు చేసినా శిక్ష తప్పదు. ఇంగ్లీష్ మీడియా కథనం ప్రకారం.. మైనర్ గాయాలు, మేజర్ గాయాల వల్ల పర్మినెంట్ డిజెబిలిటీ జరగొచ్చు. అలా అయితే రూ.750 నుంచి రూ.75వేల వరకూ జరిమానాతో పాటు ఐదేళ్ల పాటు జైలు శిక్ష తప్పదు.
కొన్నేళ్లుగా జంతువుల హక్కుల కోసం సంఘాలు రివిజన్ చేపట్టాలని కోరుతున్నాయి. శిక్షలు కఠినతరం చేస్తేనే మార్పులు వస్తాయని సూచిస్తున్నాయి. జంతువులపై క్రూరత్వంతో వ్యవహరిస్తే.. చిన్నపాటి జరిమానాలు, శిక్షలు వాళ్లను ఆలోచింపజేయవని ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని అధికారులు అంటున్నారు.