Jana Gana Mana: పూరీ-విజయ్ రెండో పాన్ ఇండియా సినిమా లాంచింగ్!
పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో మరో చిత్రం ప్రకటించారు. జనగణమన (JGM) అనే టైటిల్ తో రూపుదిద్దుకోబోయే ఈ చిత్రం మంగళవారం ఓపెనింగ్ జరుపుకుంది.

పూరీ-విజయ్ దేవరకొండ కాంబోలో మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉండబోతుందని గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగితి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అనౌన్స్‌మెంట్‌ను చేశారు చిత్ర యూనిట్.

పూరీ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ మరోసారి నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.

ఈ మంగళవారం మధ్యాహ్నం మంచి ముహూర్తం చూసుకుని నెక్ట్స్ మిషన్ లాంచ్ చేశారు.

ఈ సినిమాకు జనగణమన(JGM) అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.

ఇక ఆర్మీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర టైటిల్ పోస్టర్ చూస్తే మనకు అర్థం అవుతుంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ మేజర్‌గా మనకు కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాను 2023 ఆగస్టు 03న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమా లాంఛ్‌లో భాగంగా స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.