డైరక్టర్ శంకర్‌ను హోల్డ్‌లో పెట్టిన రామ్ చరణ్

డైరక్టర్ శంకర్‌ను హోల్డ్‌లో పెట్టిన రామ్ చరణ్

Updated On : February 12, 2021 / 8:12 AM IST

Ram Charan: హీరోలంతా లాక్ డౌన్ తర్వాత సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ఒకొక్కరు రెండుమూడు సినిమాలు చేతిలో పెట్టుకుని షూటింగ్‌లకు షెడ్యూల్ ఫిక్స్ చేసేసుకున్నారు. టాప్ సెలబ్రిటీల్లో దాదాపు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే ఒక్క సినిమా మీదనే ఉన్నారు. అలా అని వేరే సినిమాలు చేయడం లేదా అంటే ఆయన చేతిలో రెండు మూడు సినిమాలు హోల్డ్‌లో ఉన్నాయట.

అందులో మెగా డైరక్టర్ శంకర్ కూడా ఉన్నారట. అంతేకాకుండా జర్నీ డైరక్టర్ గౌతం తిన్ననూరితో పాటు వెంకీ కుడుముల, వంశీ పైడిపల్లిల స్క్రిప్ట్ కూడా వింటున్నారు. సుదీర్ఘం కాలం నుంచి జరుగుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్.. గౌతం, వెంకీల స్క్రిప్ట్ ను దాదాపు ఓకే చేసినట్లుగా కనిపిస్తుంది.

రాజమౌళి డైరక్షన్ లో సినిమా తీశాక.. ఎటువంటి హైప్ లేకుండా సింపుల్ స్క్రిప్ట్ తో రెడీ అవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు చెర్రీ. ఈ కోణంలో వంశీ పైడిపల్లికి కూడా అవకాశమిచ్చేట్లుగా కనిపిస్తుంది.